పుష్ప టీజర్.. ఇది కూడా కాపీ కొట్టేశారా.. ఆడుకుంటున్న నెటిజన్లు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న సినిమాల్లో పుష్ప ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల కాగా దానిపై కూడా కాపీ కామెంట్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది.

నార్త్ ఆడియెన్స్ కూడా
అల్లు అర్జున్ తన కెరీర్ లో మొదటిసారి చేస్తున్న సినిమా పుష్ప. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త అవతారంలో పుష్ప రాజ్ గా కిక్కివ్వబోతున్న ఈ స్టార్ హీరోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నార్త్ ఆడియెన్స్ కూడా పుష్ప కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మలయాళం ఆడియెన్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

సరికొత్త మేకింగ్ స్టైల్
టీజర్ వైరల్ అయిన విధానం చూస్తుంటే మరో టాలీవుడ్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని టాక్ వస్తోంది. సుకుమార్ సరికొత్త మేకింగ్ స్టైల్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సినిమా పూర్తిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ మూవీగా తెరకెక్కుతోంది.

దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. కాపీ అంటూ..
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కూడా పాజిటివ్ కామెంట్స్ చాలానే వచ్చాయి. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మరింత బలాన్ని ఇచ్చింది. అయితే అది మొత్తం కాపీ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం వైరల్ గా మారింది. ముఖ్యంగా అవేంజర్ సినిమా మ్యూజిక్ తో పాటు అక్షయ్ కుమార్ నటించిన బేబి సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మిక్స్ చేసి కొట్టారని అంటున్నారు. మరి ఈ కామెంట్స్ పై పుష్ప టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

భారీ బడ్జెట్ తో పుష్ప
ఇక సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల చేయబోతున్నారు. సినిమా కోసం మొదటిసారి ఈ సంస్థ 200కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం.
హెబ్బా పటేల్ క్లీవేజ్ షో.. అందంతో అదరగొడుతున్న బ్యూటీ


Click it and Unblock the Notifications











