ఎన్టీఆర్ లైనప్‌లో భారీ మార్పులు.. నెల్సన్ మూవీకి బ్రేక్, త్రివిక్రమ్‌కు గ్రీన్ సిగ్నల్?

NTR Lineup: ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు. అలాగే, భారీ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్‌లపై కూడా సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఎన్టీఆర్ లైనప్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'డ్రాగన్'షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తయ్యాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్'అనే భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కథపై త్రివిక్రమ్ చాలాకాలంగా పని చేస్తున్నారని, ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్-నెల్సన్ సినిమా మొదలవుతుందని కొందరు భావించారు. కానీ నెల్సన్ షెడ్యూల్ మారడంతో ఆ అవకాశం దాదాపు లేకపోయినట్టే కనిపిస్తోంది.

NTR s Upcoming Lineup Trivikram Project May Move Ahead of Nelson s Film After Dragon

గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'జైలర్'విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్‌తో ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'జైలర్ 2' తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా 'జైలర్ 2' తర్వాత కూడా నెల్సన్ మరో భారీ ప్రాజెక్ట్‌కు కమిట్ అయినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే 'తలైవర్ 173'ప్రాజెక్ట్‌ను మొదట దర్శకుడు సుందర్ సి చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాధ్యతలను నెల్సన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని తమిళ సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ నిజమైతే నెల్సన్ షెడ్యూల్ పూర్తిగా బిజీ అయిపోతుంది. 'జైలర్ 2'పూర్తయ్యాక వెంటనే రజనీ- కమల్ సినిమా ప్రారంభమైతే, ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమా మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఎన్టీఆర్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కు మార్గం సుగమమైందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఎన్టీఆర్ తన తదుపరి ప్రాధాన్యతను 'గాడ్ ఆఫ్ వార్'కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్-నెల్సన్ కాంబో మూవీ 2028 వరకు వాయిదా పడే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X