షాకింగ్: చిరంజీవి దురదృష్టానికి కారణం అదే...
హైదరాబాద్: సినిమా రంగంలో ఉన్నపుడు చిరంజీవి రేంజి ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో అన్న ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో రారాజుగా వెలుగుగొందిన వ్యక్తి ఆయనే. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి.
ఎన్టీఆర్ మాదిరిగా.....ముఖ్య మంత్రి అవుదామని పార్టీ స్థాపించిన చిరంజీవికి 2009 ఎన్నికల్లో పెద్ద నిరాశ ఎదురైంది. ఆ తర్వాత పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేసారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి వరించినా ఆ సంబరం ఎక్కువ కాలం నిలవలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యతలు చేపట్టి ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. చిరంజీవి పెద్ద హీరో అని పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కాస్తా జీరో అయిపోయింది.
చిరంజీవి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ న్యూమరాలజిస్ట్ చెప్పిన వివరాల ప్రకారం చిరంజీవిని షార్ట్ కట్‌లో మీడియా చిరు.. చిరు.. అని రాయడం వల్లే ఆయన్ను దురదృష్టం వెంటాడిందట. చిరు అనే పేరులోనే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయట.

మీడియా వారికి సందేశాలు
దీంతో సవరణ చర్యలు చేపట్టిన చిరంజీవి ఇకపై తనను ఎవరూ ‘చిరు' అని పిలవకుండా పూర్తి పేరుతో ‘చిరంజీవి' అని పిలిచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు మీడియా వారికి కూడా సందేశాలు పంపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

150వ సినిమాలో బిజీ
ప్రస్తుతం పొలిటికల్‌గా పెద్దగా పని లేక పోవడంతో చిరంజీవి తన 150వ సినిమాతో బిజీ అయిపోయారు. వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నారు.

ఆయన భార్యే నిర్మాత
చిరంజీవి 150వ సినిమాను ఆయన భార్య సురేఖ నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తాడు.

కథల కోసం అన్వేషణ
ప్రస్తుతం ఈచిత్రానికి కథల కోసం అన్వేషణ జరుగుతోంది. ఇప్పటికే పలు కథలు వచ్చినా...ఇంకా బెస్ట్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నారు.

రూ. కోటి నజరానా
చిరంజీవి 150వ సినిమాకు సరిపోయే అద్భుతమైన స్టోరీ తెస్తే రూ. కోటి నజరానా ఇవ్వడానికి తాను సిద్ధమే అని రామ్ చరణ్ కూడా ప్రకటించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











