అనితపై టాప్ హీరో మనసు?
అనిత ఛార్మింగ్ అనిత మరోసారి టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఏక్తా కపూర్ సీరియల్స్ ద్వారా సుపరిచితురాలైన అనిత తెలుగులో ఉదయ్ కిరణ్ సరసన తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు-నేను' చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో పాటు అనితకు యువతలో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత 'శ్రీరామ్', 'తొట్టిగ్యాంగ్', 'నిన్నే ఇష్టపడ్డాను' వంటి పలు చిత్రాల్లో నటించింది. నాగార్జున 'నేనున్నాను' చిత్రంలో ఓ సాంగ్ లో కూడా నర్తించింది. కొద్ది కాలంలో టాలీవుడ్ కు దూరంగా ఉన్నప్పటికీ తమిళ, కన్నడ చిత్రలతో పాటు బాలీవుడ్ లో కూడా తన అదృష్టం పరీక్షించుకుంటూ వచ్చింది. కొద్ది గ్యాప్ తర్వాత మరోసారి అనిత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. దక్షిణాది చిత్రాలపైనే తన దృష్టి ఉందనీ ఆమె ఇటీవల చెప్పుకొచ్చారు.
అనిత ఇప్పుడు సరికొత్త గ్లామర్ తో తొణికిసలాడుతుండటం పలువురు సీనియర్ హీరోల దృష్టిలో పడినట్టు తెలుస్తోంది. ఇటీవల 'సంతోషం' అవార్డుల కార్యక్రమంలో అనిత మెరుపులా మెరిసింది. ఆమె అప్పియరెన్స్ ఓ టాప్ స్టార్ ను ఆకట్టుకుందనీ, త్వరలోనే ఆ స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని అనిత అందిపుచ్చుకోనుందనీ తెలుస్తోంది. సరైన హిట్ వస్తే మరి కొంతకాలం అనిత టాలీవుడ్ లో కొనసాగే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











