న్యూఇయర్ పార్టీ: పూనమ్ పాండేకు భారీగా డబ్బు?
హైదరాబాద్: బాలీవుడ్ సెక్స్ బాండ్ పూనమ్ పాండే ఈ రోజు రాత్రి హైదరాబాద్‌లో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో హాట్ అండ్ సెక్సీగా పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ దుర్గం చెరువు వద్ద గల ‘మరకేష్' ఇందుకు వేదిక కానుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏకైక లేక్ వ్యూ న్యూ ఇయర్ పార్టీ ఇదే కావడం గమనార్హం.
ఈ పార్టీలో పూనమ్ పాండేతో పాటు పలువురు బాలీవుడ్ బాన్సర్లు, ముంబైకి చెందిన ప్రముఖ డిజె సాంన్జ్ పాల్గొంటున్నారు. ఈ పార్టీలో గంట సేపు పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను పూనమ్ పాండే రూ. 3 కోట్లు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. పూనమ్ షో చూడాలనుకునే వారు వేలు కర్చు చేసి టిక్కెట్లు కొనాల్సి ఉంటుంది.

పనిలో పనిగా పూనమ్ పాండే నటిస్తున్న ‘మాలిని అండ్ కో' అనే తెలుగు సినిమా ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ‘మాలిని అండ్ కో' చిత్రానికి వీరు.కె దర్శకుడు. మనీషా ఫిలింస్ పతాకంపై కిషోర్‌రాఠి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం ద్వారా పూనమ్ పాండే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.
టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రమిది. రెండు అంశాలను మేళవించి వినోదాత్మకంగా తెరకెక్కించామని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రంలో పూనమ్ పాండేతో పాటు సామ్రాట్, మిలన్, ఖుషీ, ఫరా, కావ్యాసింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, మాటలు: మరుధూరి రాజా.


Click it and Unblock the Notifications











