OG 2 కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ ప్లాన్.. భారీ ట్విస్ట్‌తో సుజీత్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో 'OG 2' ఒకటి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 'OG 2'అఫీషియల్ అనౌన్స్ మెంట్ కు ముందుగానే భారీ ప్లానింగ్ చేస్తున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ కూడా కఠిన నియమాలను పాటిస్తున్నారట. ఇంతకీ ఆ ప్లానింగ్ ఏంటీ?

తాజా సమాచారం ప్రకారం, 'OG 2'లో పవన్ కళ్యాణ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారట. ఇప్పటికే రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తన లుక్, ఫిట్‌నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పాత్రకు తగ్గట్టుగా కనిపించేందుకు స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారని, బరువు తగ్గడంతో పాటు మరింత స్టైలిష్‌గా కనిపించేలా మేకోవర్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

OG 2 Pawan Kalyan s New Look Sujeeth s Massive Twist Plan Creates Huge Buzz

'OG' సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్‌లో ఆ పాత్ర మరింత డార్క్, మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. అందుకే పాత్ర రూపురేఖల విషయంలో సుజీత్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్‌ను ప్రెజెంట్ చేయాలనేది దర్శకుడు సుజీత్ లక్ష్యమని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు దర్శకుడు సుజీత్ కూడా 'OG 2' స్క్రిప్ట్ పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు టాలీవుడ్‌ టాక్. సాధారణ సీక్వెల్‌లా కాకుండా, కథను మరో స్థాయికి తీసుకెళ్లేలా రైటింగ్ టీమ్ వర్క్ చేస్తోందట. ప్రస్తుతం ప్రత్యేక రచయితల బృందం బౌండ్ స్క్రిప్ట్‌పై పని చేస్తోందని, ప్రతి సీన్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా డిజైన్ చేస్తున్నారని సమాచారం. స్క్రిప్ట్ పూర్తిగా అనుకున్న విధంగా వచ్చిన తర్వాతే షూటింగ్‌పై నిర్ణయం తీసుకోవాలనేది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది.

ఇక అభిమానులను మరింత ఎగ్జైట్ చేస్తున్న అంశం ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించే. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, 'OG 2'లో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ ఇండియన్ సినిమా హిస్టరీలో గుర్తుండిపోయేలా తెరకెక్కించే భావిస్తున్నారట. ప్రేక్షకులు అస్సలు ఊహించని భారీ ట్విస్ట్‌ను అక్కడ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ ట్వీస్టులతో థియేటర్లలో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురిచేసే విధంగా ఆ సీక్వెన్స్ ను డిజైన్ చేస్తునట్టు ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ నెలాఖరులో పవన్ కళ్యాణ్, సుజీత్ మధ్య కీలక సమావేశం జరగబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో 'OG 2' కథ, పాత్రలు, కథనం, షూటింగ్ షెడ్యూల్ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు 'OG 2'పై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు అభిమానులందరి చూపు మాత్రం అధికారిక ప్రకటనపైనే ఉంది.

Read more about: pawan kalyan sujeeth og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X