OG Business: OG మూవీ బిజినెస్ సంచలనం.. టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్.. నైజాం రైట్స్ ఎన్ని కోట్లంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OGO. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ ఆలస్యమైనపప్పటీకీ.. ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే.. నైజాం థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
అయితే ఓజీ విషయానికి వస్తే.. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) అనే వర్కింగ్ టైటిల్‌తో డిసెంబర్ 2022 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కల్యాణ్, సుజిత్ కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే కొద్ది రోజుల షూటింగ్ అనంతరం ఈ సినిమా వాయిదా పడుతూ వస్తున్నది. అందుకు కారణం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం.. అసెంబ్లీ ఎన్నికలు రావడం.. పవర్ స్టార్ బిజీగా మారడం లాంటి అంశాలు సినిమా షూటింగుకు అడ్డంకిగా నిలిచాయి.
మాఫియా బ్యాక్ డ్రాప్‌తో ముంబై, ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ స్వయంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకొన్నారు. ముంబై నగరంలో కొద్ది రోజుల క్రితం జరిగిన షూటింగులో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఓ పక్క జరుగుతుంటే... మరో పక్క ఈ సినిమా బిజినెస్ ఊపందుకొన్నది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా జరిగిన బిజినెస్‌గా చెప్పుకొంటున్నారు. ఈ సినిమా ఇతర ఏరియాలకు సంబంధించిన బిజినెస్‌కు కూడా భారీ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది.
గతేడాది పవన్ కల్యాణ్ బర్త్ డేకు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు అనూహ్యమైన క్రేజ్ లభించింది. ఆ గ్లింప్స్ తర్వాత అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు అందించే లీకులతో క్రేజ్ ఆకాశానికి అంటుకొనేలా చేసింది. తాజాగా నైజాం బిజినెస్ మరోసారి ఈ సినిమాపై అంచనాలు రెండితలు పెంచింది. ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











