చిరంజీవి చిత్రం స్టోరీలైన్ తో 'ఓ మై ప్రెండ్'?

By Srikanya

చిరంజీవి, రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరు మిత్రులు చిత్రం స్టోరీ లైన్ ని బేస్ చేసుకుని సిద్దార్ద తాజా చిత్రం ఓహ్ మై ప్రెండ్ రూపొందించారని టాక్ వినపడుతోంది. ఈ చిత్రంలో సినిమా ప్రారంభమే.. ఒక అబ్బాయి ఒక అమ్మాయి జీవితాంతం స్నేహుతులగా ఉండగలా అనే వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభమవుతుంది. అయితే ఇద్దరు మిత్రులు, వెంకటేష్ వసంతం, తరుణ్ నువ్వే కావాలి వంటి స్టోరీ లైన్స్ తో సినిమా తయారైనా ట్రీట్ మెంట్ మాత్రం డిఫెరెంట్ గా తయారు చేయటం ప్లస్ అయ్యిందంటున్నారు. చిరంజీవి ఇద్దరు మిత్రులు చిత్రంలో చిరంజీవి, సాక్షి శివానంద్ ఇద్దరూ స్నేహితులు. అయితే ప్రపంచం అంతా వీరిద్దరి రిలేషన్ షిప్ ని చూసి ప్రేమ అనుకుంటుంది. అయితే వాళ్లు తాము స్నేహితులమని చెప్పి వేరు వేరు పెళ్లిళ్లు చేసుకుంటారు. ఓ మై ప్రెండ్ చిత్రంలోనూ సిద్దార్ధ, శృతి హాసన్ ఇద్దరూ క్జోజ్ ప్రెండ్స్. వారిద్దరని ప్రపచంమంతా ప్రేమికులు అనుకుంటుంది. అయితే ఇద్దరూ వేరు వేరు వ్యక్తులతో ఎంగేజ్ అయ్యి, వారి మద్యన ఉన్నది అస్సలు ప్రేమా, స్నేహమా అనే విషయాన్ని క్లైమాక్స్ లో తేల్చుకుంటారు.

ఇక అందులోనూ ఆడవారి మాటలకు అర్దాలు వేరులే చిత్రంలో కోట, వెంకటేష్ తరహా తండ్రి, కొడుకుల రిలేషన్ షిప్ కూడా సిద్దార్ద, తణికెళ్ల భరణి మధ్య బాగా వర్కవుట్ చేసారని చెప్తున్నారు. కథలో చందు (సిద్ధార్థ్‌) గిటారిస్ట్‌. ఇతనికి సిరి (శృతి హాసన్‌) అనే స్నేహితురాలుంటుంది. ఆమె భరత నాట్యం నేర్పిస్తుంటుంది. ఈ స్నేహితుల మధ్యలోకి రీతు (హన్సిక) ప్రవేశిస్తుంది. ఆ తరవాత ఏమైందన్నది సస్పెన్స్‌. ఈ కథలో ఉదయ్‌ (నవదీప్‌)పాత్ర కూడా కీలకమే. అలాగే సిద్దార్ద ఈ మధ్య కాలంలో బొమ్మరిల్లు తరహాలో ఇచ్చిన బెస్ట్ ఫెరఫార్మెన్స్ అని ప్రీమియర్ షోలు చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే హన్సిక కాస్త ఒళ్లు తక్కువగా ఉండి ఉంటే బాగుండేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X