twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్డున ప్రీ పోన్డ్ చేసారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సెప్టెంబర్‌ 5న విడుదల కానుందంటూముందుగా దర్శకుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ అంటే వారం రోజులు ముందుగానే విడుదల చేయాటనికి సన్నాహులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య పుట్టిన రోజైన ఆగస్టు 29న ఈ చిత్రం విడుదల చేయాలని నాగార్జున నిర్ణయించినట్లు ట్రేడ్ లో వినపడుతోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా ఏ ప్రకటనా రాలేదు. ఈ చిత్రానికి విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మాత. పూజాహెగ్డే హీరోయిన్.

    దర్శకుడు మాట్లాడుతూ ''రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కాలేజీ చదువు పూర్తి చేసి కన్‌ఫ్యూజన్‌లో ఉండే కార్త్తీక్‌ పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడు. స్వేచ్ఛను ప్రేమించే కార్తీక్‌ ఓ సందర్భంలో నందనను కలుస్తాడు. ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతన్ని ఇష్టపడదు. అయినా అనుకోని పరిస్థితుల్లో కార్తీక్‌ను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ కార్తీక్‌ ఆమె ప్రేమను గెలుచుకున్నాడా.. లేదా? అనేది ఆసక్తికరం. వైవిధ్యమైన ఇతివృత్తంతో సాగే సినిమా ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. చైతూ, పూజా తమ పాత్రలకు న్యాయం చేశారు.''అని తెలిపారు.

    Oka Laila Kosam audio launch in Vijayawada1

    నిర్మాత మాట్లాడుతూ... ''ప్రేమకు రీజన్స్‌ ఉండవు. ఓన్లీ ఎమోషన్స్‌' అని నమ్మే యువకుడు. ప్రేమంటే ఆమడ దూరం ఉండే అమ్మాయి. తీపి, పులుపు లాంటి వీరి మధ్య విజయ్‌కుమార్‌ కొండా శైలిలో తెరకెక్కిన ప్రేమకథ ఇది. నేటి యువత మనసులు, ప్రేమలను తెరపై ఆవిష్కరిస్తున్నాం. త్వరలో పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ'' అంటున్నారు నిర్మాత.

    అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రఽధారులు. ఈ సినిమాకు కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.

    English summary
    Naga Chaitanya’s Oka Laila Kosam makers are planning to release on Aug.29th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X