వాయిదా పడచ్చంటున్నారు

By Srikanya

హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సెప్టెంబర్‌ 5న విడుదల కాకపోవచ్చునని వినిపిస్తోంది. వరసగా ఆగడు, పవర్, గోవిందుడు అందరి వాడేలే చిత్రాలు వరసగా రిలీజ్ కు రెడీ అవుతూండటంతో మధ్యలో ఈ చిత్రం వేయకపోవచ్చు అని అంటున్నారు. వచ్చే నెలకు వాయిదా వేసే అవకాసం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారికంగా ఏ వార్తా లేదు. ఈ చిత్రానికి విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మాత. పూజాహెగ్డే హీరోయిన్.

దర్శకుడు మాట్లాడుతూ ''రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కాలేజీ చదువు పూర్తి చేసి కన్‌ఫ్యూజన్‌లో ఉండే కార్త్తీక్‌ పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడు. స్వేచ్ఛను ప్రేమించే కార్తీక్‌ ఓ సందర్భంలో నందనను కలుస్తాడు. ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతన్ని ఇష్టపడదు. అయినా అనుకోని పరిస్థితుల్లో కార్తీక్‌ను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ కార్తీక్‌ ఆమె ప్రేమను గెలుచుకున్నాడా.. లేదా? అనేది ఆసక్తికరం. వైవిధ్యమైన ఇతివృత్తంతో సాగే సినిమా ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. చైతూ, పూజా తమ పాత్రలకు న్యాయం చేశారు.''అని తెలిపారు.

Oka Laila Kosam expecting to release in october

నిర్మాత మాట్లాడుతూ... ''ప్రేమకు రీజన్స్‌ ఉండవు. ఓన్లీ ఎమోషన్స్‌' అని నమ్మే యువకుడు. ప్రేమంటే ఆమడ దూరం ఉండే అమ్మాయి. తీపి, పులుపు లాంటి వీరి మధ్య విజయ్‌కుమార్‌ కొండా శైలిలో తెరకెక్కిన ప్రేమకథ ఇది. నేటి యువత మనసులు, ప్రేమలను తెరపై ఆవిష్కరిస్తున్నాం. త్వరలో పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ'' అంటున్నారు నిర్మాత.

అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రఽధారులు. ఈ సినిమాకు కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X