‘RRR’ లేటెస్ట్ అప్‌డేట్: రాంచరణ్ కంటే ఎన్టీఆర్‌కే ఎక్కువట.. అందుకే ముందే పంపేశారట!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. 'బాహుబలి' సిరీస్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆయన.. దాని తర్వాత ఇద్దరు బడా హీరోల జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌తో కలిసి 'RRR' అనే సినిమా చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో పాటు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? వివరాల్లోకి వెళితే..

సినిమా గురించి చిత్ర యూనిట్ చెప్పిందిదే

సినిమా గురించి చిత్ర యూనిట్ చెప్పిందిదే

RRR షూటింగ్ ప్రారంభమై ఏడాది దాటిపోయింది. ఈ సమయంలో సినిమా షూటింగ్‌కు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇందులో నటిస్తున్న హీరోలకు గాయలవడంతో పాటు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం తదితర కారణాలతో ఈ పరిస్థితి ఎదురైంది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమా షూటింగ్ డెబ్బై శాతం పూర్తయిందని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇద్దరి హీరోయిన్లు వీళ్లే

ఇద్దరి హీరోయిన్లు వీళ్లే

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. కొమరం భీంగా, రామ్ చరణ్ తేజ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి విధితమే. తారక్‌కు ఫారెన్ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారు. ఆలియా భట్ నటిస్తున్నట్లు ఇది వరకే ప్రకటించగా.. ఒలీవియా పేరును మాత్రం ఇటీవలే వెల్లడించారు.

అలా విడుదలవుతున్న మొదటి సినిమా

అలా విడుదలవుతున్న మొదటి సినిమా

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పది భాషల్లో విడుదలవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ సహా పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట. అలాగే, చైనా, జపాన్ తదితర దేశాల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తారని అంటున్నారు.

అప్పుడు ప్రకటించినది కాదంటున్నారు

అప్పుడు ప్రకటించినది కాదంటున్నారు

ఈ సినిమా ప్రారంభించిన సమయంలోనే రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఇప్పుడా తేదీని మారుస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2, 2020న విడుదల చేస్తారని అంటున్నారు. దీంతో సినిమా విడుదల తేదీపై గందరగోళం నెలకొంది.

రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్‌కే ఎక్కువ సీన్లు

రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్‌కే ఎక్కువ సీన్లు

అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న RRR గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్‌కే ఎక్కువ సీన్స్ ఉన్నాయట. అవి సోలో సీన్స్ మాత్రం కాదు. తమ సరసన నటిస్తున్న హీరోయిన్లతో అని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంటే తారక్ రొమాన్స్ ఎక్కువగా ఉంటుందన్న మాట.

Recommended Video

#CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
 ఆమెను అందుకే పంపేశారట

ఆమెను అందుకే పంపేశారట

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించే ఆలియా భట్.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఆమె పట్టుమని పది రోజులు కూడా షూటింగ్‌లో పాల్గొనలేదని అంటున్నారు. వాస్తవానికి ఆమె పదిహేను నిమిషాలు మాత్రమే సినిమాలో కనిపిస్తుందట. అందుకే ఆమె షూటింగ్ త్వరగా ముగించేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X