మూడు కోట్లు కాదు.. 30కోట్లు ఇచ్చినా రాదట.. బుట్టబొమ్మ రేటు చూసి పడిపోయే రకం కాదు

హీరోయిన్స్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలి అంటే గ్లామర్ తో టాలెంట్ కూడా ఉండాలి. వీలైనంత వరకు కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మొదటికే మోసం వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో డబ్బు ఆశ చూపి మరి ప్రాజెక్టులు చేయమని ఒప్పిస్తారు. అయితే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మాత్రం ఆ విధంగా కాకుండా కేవలం పెద్ద సినిమాల్లో తనకు నచ్చిన వాటికే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆమె రేటు చూసి పడిపోయే రకం కాదనే టాక్ కూడా వస్తోంది.

అప్పటి నుంచి..అస్సలు తగ్గట్లేదు

అప్పటి నుంచి..అస్సలు తగ్గట్లేదు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో ప్రస్తుతం హై డిమాండ్ ఉన్న వారిలో పూజా హెగ్డే ఉంది. ఆమె ఎంత అడిగినా కూడా ఇవ్వడానికి రెడీ అంటున్నారు టాలీవుడ్ నిర్మాతలు. గత కొంత కాలంగా ఆమె సక్సెస్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోవడమే అందుకు కారణం. ఎప్పుడైతే డీజే సినిమాలో గ్లామర్ తో హీటెక్కించిందో అప్పటి నుంచే అమ్మడు అస్సలు తగ్గట్లేదు.

 అందరికి ఆమెనే కావాలట

అందరికి ఆమెనే కావాలట

కేవలం హీరోయిన్ గానే కాకుండా ఐటెమ్ సాంగ్స్ తో కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. రంగస్థలం సినిమాలో జిగేలు రాణి అంటూ మాస్ ఆడియెన్స్ కి మత్తెక్కించేసింది. ఇక ఆ తరువాత అరవింద సమేత, మహర్షి సినిమాలు కమర్షియల్ మంచి వసూళ్లను అందుకోవడంతో స్టార్ హీరోలు అందరూ కూడా పూజా హెగ్డేను టార్గెట్ చేశారు.

 బాలీవుడ్ లో బడా ఆఫర్స్

బాలీవుడ్ లో బడా ఆఫర్స్

అల.. వైకుంఠపురములో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేయడంతో అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. బాలీవుడ్ లో కూడా హౌజ్ ఫుల్ 4తో మంచి హిట్ అందుకుంది. దీంతో హిందీ హీరోలు కూడా అమ్మడి వెంట పడుతున్నారు. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ తో పాటు రణ్ వీర్ సింగ్ తో సినిమాలు చేయనుంది. ఆ రెండు సినిమాలు హిట్టయితే ఇక పూజ తెలుగులోకి రావడం కష్టమే.

 టాలీవుడ్ సినిమాలనీ రిజెక్ట్ చేస్తోందా?

టాలీవుడ్ సినిమాలనీ రిజెక్ట్ చేస్తోందా?

ఇప్పటికే తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను పూర్తి చేసిన అమ్మడు, మరికొన్ని రోజుల్లో రాధేశ్యామ్ షూటింగ్ ని కూడా ఫినిష్ చేయనుంది. టాలీవుడ్ ఆఫర్స్ ఇంకా వస్తున్నప్పటికి పూజ ఒప్పుకోవడం లేదట. ఎందుకంటే ఆమె టార్గెట్ మొత్తం ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉందట. చేతిలో ఉన్న ప్రాజెక్టులతో పాటు మరో రెండు సినిమాలను ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్.

Recommended Video

Middle Class Melodies Team Interview Part 8
 రెంటు పెంచి టెంప్ట్ చేస్తున్నప్పటికి..

రెంటు పెంచి టెంప్ట్ చేస్తున్నప్పటికి..

ఇక తెలుగు నుంచి ఇప్పుడు పూజకు 3కోట్ల ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. అమ్మడు పారితోషికం రెండున్నర కోట్లే అయినప్పటికీ డేట్స్ కోసం నిర్మాతలు రెంటు పెంచి టెంప్ట్ చేస్తున్నారట. కానీ ఆమె మాత్రం మూడు కాదు కదా ముప్పై ఇచ్చినాకూడా ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితుల్లో లేదని టాక్ వస్తోంది. మరో రెండేళ్ల వరకు బాలీవుడ్ సినిమాలతోనే మంచి హిట్స్ అందుకొని ఒక ట్రాక్ సెట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X