»   »  'ఓం శాంతి ఓం'నాగార్జునతో?

'ఓం శాంతి ఓం'నాగార్జునతో?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nagarjuna
షారూఖ్ ఖాన్ ,దీపికా పడుకోనీ జంటగా ఫరాఖాన్ రూపొందించిన ఓ శాంతి ఓం చిత్రం దీపావళికి రిలీజై దాదాపు 106 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రస్తుతం ఆ సినిమాను తెలుగులో నాగార్జునతో చేయాలని ఓ దర్శక,నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆ సినిమా రైట్స్ కూడా తీసుకున్నారని ఇప్పటికే స్క్రిప్టు వర్క్ చేసారని,కింగ్ పూర్తయిన వెంటనే డేట్స్ ఇస్తే పూర్తి చేస్తానని చెప్పారుట. నాగార్జున కూడా ఆ ఆఫర్ కి సముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆయన గతంలో ఇలాంటి పునర్జన్మ సబ్జెక్టులతో జానకిరాముడు చేసిన సంగతి గుర్తుచేసారని చెప్తున్నారు. అలాగే నాగ్ అయితే సెవెంటీస్ నాటి గెటెప్స్ కీ, రొమాంటిక్ లుక్ కీ సరిపోతాడనీ, ఆయన చెయ్యకపోతే సినిమా మొదలపెట్టనని చెప్పటం జరిగిందిట. అలాగే హీరోయిన్ గా దీపికా రేంజ్ వాళ్ళు ఎవరు ఉన్నారు...వాళ్ళని తీసుకొస్తే తనకేమీ అభ్యంతరం లేదని నాగార్జున అన్నారని ప్రస్తుతం వారు అదే వేటలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇక అన్నీ అనుకూలిస్తే త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి అధికారిక ప్రకటన వెలబడే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X