ఆల్ టైం రికార్డ్: హీరోగారి రెమ్యూనరేషన్ 150 కోట్లు?

By Bojja Kumar

హైదరాబాద్: ఇండియాలో సినిమా బడ్జెట్ మాత్రమే కాదు...హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్లు కూడా భారీగా పెరిగి పోతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్లో స్టార్ హీరోలు 60 కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు. ఇది మరింత పోరగబోతోంది. బాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో 'శుద్ధి' అనే చిత్రంలో నటించబోతున్న సల్మాన్ ఖాన్ ఏకంగా రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడట. అదే నిజమైతే ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదో రికార్డ్.

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.....సల్మాన్ ఖాన్‌కు ఈ భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ కింద సినిమాకు వచ్చే వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అడిగారని సమాచారం. అయితే చివరకు 150 కోట్ల రెమ్యూనరేషన్‌కు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

OMG! Salman Gets 150 Crore For Shuddhi

'శుద్ధి' చిత్రాన్ని కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ తెరకెక్కించబోతోంది. తొలుత ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌ను హీరోగా తీసుకోవాలనుకున్నారు. అయితే అనారోగ్య కారణాలతో హృతిక్ రోషన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ కూడా ఈ చిత్రం కోసం డేట్స్ ఇవ్వ లేక పోయారు. చివరగా సల్మాన్ ఖాన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'కిక్' విజయంలో మునిగి తేలుతున్నాడు. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. 'శుద్ది' చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X