‘బద్రినాథ్’విడుదలకు ముందే మరోసారి బన్నీతో కమిటైన మిల్కీ బ్యూటి..!
ఇప్పుడు టాలీవుడ్ లో అందరి కళ్ళూ 'బద్రీనాథ్' సినిమాపైనే వున్నాయి. వి.వి.వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రం 40 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో అర్జున్ ఇండియన్ సమురాయ్ (పోరాట యోధుడు) గా కొత్త లుక్ తో కనిపిస్తాడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. మరోపక్క ఈ సినిమాలోని ఓ పాటను హీరో హీరోయిన్లు అర్జున్, తమన్నాలపై ప్రస్తుతం ఇటలీలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. జూన్ మొదటి వారంలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'వరుడు' వంటి ఫ్లాప్ సినిమా తర్వాత అర్జున్ చేస్తున్న భారీ చిత్రం కాబట్టి ఈ సినిమా పట్ల ఇండస్ట్రీలో చాలా అంచనాలున్నాయి.
బద్రినాథ్ విడుదల అవకముందే తమన్నా అల్లు అర్జున్ మరోసారి నటించే అవకాశాన్ని కొట్టేసింది. త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ముందుగా ఇలియానా అనుకున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న ఇలియానాతో నటించడానికి బన్ని ఒప్పుకోలేదని తెలుస్తుంది. దీంతో ఈ ఆఫర్ తమన్నాని వరించింది. ఇప్పటికే తమన్నా రామ్ చరణ్ తో 'రచ్చ' ను, మహేష్ సరసన 'ది బిజినెస్ మెన్' సినిమాలోను నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











