Anushka Shetty: మళ్ళీ అదే సమస్యతో బాధపడుతున్న స్వీటీ.. మరో రెండు నెలలు కష్టాలు తప్పవు!

టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం లో అగ్రహీరోయిన్ గా గుర్తింపు అందుకుంటున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లొ అనుష్క శెట్టి ఒకరు. ఎంత మంది హీరోయిన్స్ పోటీగా వచ్చినా కూడా స్వీటీకి ఎందులోనూ పోటీ ఇవ్వలేరనే చెప్పాలి. అందంలో లోనే కాకుండా అభినయంలో నటనలో ఆమె సెలెక్ట్ చేసుకునే సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. కమర్షియల్ ఆడియెన్స్ ను మాత్రమే కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలను మెచ్చే ఆడియన్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఎల్లప్పుడూ పాజిటివ్ గా కనిపించే స్వీటీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఇక ఆమె తదుపరి సినిమా విషయంలో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

బాహుబలి తరువాత

బాహుబలి తరువాత

బాహుబలి సినిమా తర్వాత ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయారు. అయితే అనుష్క శెట్టి మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో సినిమాలను త్వరత్వరగా సెలెక్ట్ చేసుకోవడం లేదు. మధ్యలో భాగమతి సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికే ఆ తర్వాత నిశ్శబ్దం సినిమాతో మళ్లీ ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ సినిమా ఓటీటీలో విడుదలైన అప్పటికి కూడా ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

 యూవీ క్రియేషన్స్ లో సినిమా

యూవీ క్రియేషన్స్ లో సినిమా

ఇక తదుపరి సినిమాతో ఎలాగైనా ఆడియన్స్ ను మెప్పించాలి అని అనుష్క శెట్టి సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా ఆమె తన కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తోంది. ఇక ఇప్పుడు యు.వి.క్రియేషన్స్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించే ఈ సినిమాలో అనుష్క పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట.

అసలు కథ ఇదే..

అసలు కథ ఇదే..

ఇంతవరకు అనుష్క చేయని ఒక డిఫరెంట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె దాదాపు 35 ఏళ్లకు పైబడిన ఒక మహిళగా తన తదుపరి సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక పాతికేళ్ళ కుర్రాడిగా నవీన్ ఆమె ప్రేమలో పడితే ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటాడు అలాగే వారిద్దరి మధ్య ఒక మంచి ఎమోషనల్ పాయింట్ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది ఆ సినిమా అసలు కథ అని సమాచారం.

హ్యాండ్ ఇచ్చిన అనుష్క?

హ్యాండ్ ఇచ్చిన అనుష్క?

నవీన్ పోలిశెట్టి అనుష్క శెట్టి నటించబోయే సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాలి. జూన్ మొదటి వారం లోనే షూటింగ్ స్టార్ట్ చేయాలి అని దర్శకుడు మహేష్ కూడా పూర్తిస్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు ల్. అయితే హఠాత్తుగా అనుష్క శెట్టి మళ్ళీ మరొకసారి హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది మరో రెండు నెలల వరకు సినిమా షూటింగ్ కు హాజరు కాలేను అని చెప్పిందట.

Recommended Video

Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
ఆ సమస్య కారణంగా..

ఆ సమస్య కారణంగా..

అనుష్క శెట్టి ఈ ప్రాజెక్టులో నటించబోయే పాత్రకోసం కాస్త బరువు తగ్గాలి అని దర్శకుడు సూచించాడట. అయితే పాత్ర డిమాండ్ ప్రకారం అనుష్క బరువు తగ్గాలి అని గత రెండు మూడు నెలల నుంచి చాలా ప్రయత్నాలు చేస్తుందట. ఆమె విదేశాలకు కూడా వెళ్ళింది. అయితే ప్రస్తుతం ఆమె కొంత బరువు తగ్గినప్పటికీ పూర్తిస్థాయిలో పాత్రకు న్యాయం చేసే విధంగా అయితే షేప్ రాలేదట. దీంతో అనుష్క శెట్టి సొంత నిర్ణయం ప్రకారమే మరొక 2 నెలలు సమయం కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. గతంలో బాహుబలి 2 విషయంలో కూడా అనుష్క ఇదే తరహాలో ఇబ్బంది పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X