మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి ఆలోచనలో పడ్డ బాలయ్య.. స్టోరీ సెట్ చేసిన RRR రైటర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసుల ఎంట్రీపై ఉండే క్రేజ్ మరేసినిమాకు ఉండదనే చెప్పాలి. సినిమా ప్రపంచంలో వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం అంటే.. అంత సామాన్యమైన విషయం కాదు. దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టమనే చెప్పాలి. మొదటి అడుగు మినిమామ్ సాలీడ్ గా లేకుంటే ఇండస్ట్రీలో విమర్శలపాలు కాక తప్పదు.

Recommended Video

Nandamuri Mokshagna Tollywood Entry Soon
నందమూరి వారసుడి కోసం వెయిటింగ్..

నందమూరి వారసుడి కోసం వెయిటింగ్..

ప్రస్తుతం సినీ ప్రేక్షకులలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్న విషయం.. నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీ. మూడవ జనరేషన్ నుంచి వస్తున్న చిన్నవాడు కావడంతో ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. గత మూడేళ్ళుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ బాలయ్య కొడుకు ఎంట్రీ బలంగా ఉండాలని సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

అప్పటి నుంచే రూమర్స్..

అప్పటి నుంచే రూమర్స్..

మోక్షజ్ఞ వయసు ఎప్పుడైతే.. 20లోకి వచ్చిందో అప్పటి నుంచే అతని డెబ్యూ ఫిల్మ్ పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. మెయిన్ గా లెజెండ్ సమయంలో మోక్షజ్ఞ.. బాలకృష్ణ వాడిన బైక్ తో స్టిల్స్ ఇవ్వడం జనాలను అమితంగా ఆకట్టుకుంది. దాదాపు ఎన్టీఆర్ ఫ్యామిలిలో హీరోగా పరిచయమైన వారు ఎదో ఒక సినిమాలో అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించినవారే.. కానీ మోక్షజ్ఞ పాతికేళ్ల వయసుకు దగ్గరపడినా ఇంకా స్క్రీన్ ఎంట్రీ ఇవ్వలేదు.

లాక్ డౌన్ లో చర్చలు..

లాక్ డౌన్ లో చర్చలు..

ఇన్ని రోజులు తన సినిమాల కారణంగా బిజీగా ఉన్న బాలకృష్ణ లాక్ డౌన్ కారణంగా కాస్త గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ లో సినిమాలకు సంబంధించిన చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయట. ఇదే సమయంలో మోక్షజ్ఞకి సంబంధించిన ఎంట్రీపై కూడా బాలయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడే ఉండదని చెప్పిన బాలయ్య ఇంకాస్త సమయం పడుతుందని అన్నారు. కానీ ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

స్టోరీ సెట్ చేసిన RRR రైటర్..

స్టోరీ సెట్ చేసిన RRR రైటర్..

స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్ర RRR సినిమాకు మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ బి.గోపాల్ కోసం ఇప్పటికే ఆయన ఒక కథ రాశారు. ఇక మోక్షజ్ఞ కోసం కూడా సాయి మాధవ్ ఒక స్టోరీ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో బాలయ్య చర్చలు జరుపుతున్నారనే టాక్ వస్తోంది. గతంలో బోయపాటి, క్రిష్ వంటి దర్శకుల పేర్లు వినిపించినప్పటికి సరైన క్లారిటీ రాలేదు. మొత్తంగా బాలయ్య ఈ ఏడాది లోనే కొడుకు ఎంట్రీపై అభిమానులకు ఒక వివరణ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X