ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీపై అలాంటి రూమర్లు? ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులంటే?
తెలుగు రాష్ట్రాల్లో మాస్ హీరోల ప్రస్తావన వస్తే అందులో తప్పకుండా నిలిచే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ హీరోగా ఇన్నేళ్ల కెరీర్ లో మాస్ లో భయంకరమైన ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. అందుకే తన సినిమాలు కాస్త ఆలస్యం అయినా సోషల్ మీడియాలో కానీ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ దగ్గర కానీ తన మార్క్ క్రేజ్ తాలూకా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలా పాన్ వరల్డ్ సక్సెస్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ చిత్రమే "దేవర".
దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న ఈ మాగ్నమోపస్ చిత్రం హాలీవుడ్ స్థాయి హంగులతో తెరకెక్కుతుంది. ఇంకా ఎన్టీఆర్ తో పాటుగా అనిరుద్ ఫ్యాక్టర్ ఈ సినిమాకి బిగ్ ప్లస్ గా మారింది. సరే ఇదే పెద్ద మాస్ కాంబినేషన్ అనుకుంటే దీని తర్వాత సిసలైన పాన్ ఇండియా సినిమా అది కూడా మాస్ ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ కెరీర్ 31వ సినిమా అనౌన్స్ చేయడం మరిన్ని ప్రకంపనలు క్రియేట్ చేసింది.

అయితే అసలు ఈ సినిమా అనౌన్స్ అయ్యే దాదాపు రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇంకా ఈ సినిమాపై ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించలేదు. ఆల్రెడీ ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా అలా డిలే అవుతూ ఈ ఏడాది ఆగస్ట్ నుంచి మొదలు కానుంది అని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇపుడు ఇండస్ట్రీలో కనిపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా ఇప్పుడు కూడా మొదలయ్యే అవకాశం లేదని వినిపిస్తుంది.
కాగా ఇప్పుడు ఈ సినిమా కాదని ప్రశాంత్ నీల్ తన పర్శనల్ ఫేవరెట్ సినిమా సలార్ పార్ట్ 2 ని స్టార్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. కాగా ఎన్టీఆర్ సినిమా ఏ ఆగష్టు లో అయితే స్టార్ కానుందో ఇదే ఆగష్టు నుంచి ప్రభాస్ సలార్ 2 సెట్స్ లో జాయిన్ కానున్నాడని వినిపిస్తుంది. దీనితో ఎన్టీఆర్ తో సినిమాని అంతగా ప్రశాంత్ నీల్ పట్టించుకోవట్లేదా అని కొందరు అనుకుంటున్నారు.

ఎలాగో ఎన్టీఆర్ దేవర ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాడు. సో నీల్ తో సినిమా చేసే ఆస్కారం ఉంది కానీ అక్కడ నీల్ అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. దీనితో ఈ కాంబినేషన్ సినిమాపై ఎందుకో అంత వర్కౌట్ కావడం లేదనే అనిపిస్తుంది. అయితే ఆల్రెడీ సలార్ 2 కి సంబంధించి చాలా సీన్స్ తెరకెక్కించారు. మిగతా భాగాన్ని కూడా నీల్ త్వరగా కంప్లీట్ చేసి అప్పుడు ఎన్టీఆర్ సినిమా మొదలు పెడతాడా అనేది చూడాలి మరి.
మొత్తానికి అయితే ఎన్టీఆర్ తో సినిమా మాత్రం మరింత వెనక్కి వెళ్లిందనే అనుకోవాలి. ఇక దేవర కాకుండా ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం హృతిక్ రోషన్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీ కాంబినేషన్ లో భారీ యాక్షన్ చిత్రం "వార్ 2" కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











