మళ్ళీ కన్ఫ్యూజన్‌లో పడిన మెగాస్టార్.. ఇక వినాయక్ రావాల్సిందేనా?

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోకపోవడం కాస్త అసంతృప్తికి లోనయ్యారనే టాక్ గట్టిగానే వచ్చింది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్టులతో వీలైనంత వరకు బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలని కష్టపడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక నలుగురు హీరోయిన్స్ కూడా ఉంటారని ఒక టాక్ అయితే వస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ పై కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. దాదాపు ఆ ప్రాజెక్ట్ నుంచి సుజిత్ తప్పుకున్నాడు అనే టాక్ అయితే గట్టిగానే వస్తోంది.

Once again Megastar chiranjeevi confusion on Lucifer remake

కథను కొత్తగా రాయమని హోమ్ వర్క్ ఇవ్వగా యువ దర్శకుడు మెగాస్టార్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేదని తెలుస్తోంది. దీంతో చివరకు సుజిత్ ప్రాజెక్ట్ చేయనని డ్రాప్ అవ్వడంతో మెగాస్టార్ కాస్త కన్ఫ్యూజన్ లో పడినట్లు సమాచారం. ఆచార్య ఎండ్ అవ్వగానే లూసిఫర్ రీమేక్ ని ఎలాగైనా పట్టాలెక్కించాలని వేసుకున్న ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి.

ఇక చివరికి ప్రాజెక్ట్ లోకి వినాయక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు చేసిన దర్శకుడు వివి.వినాయక్ మెగాస్టార్ స్టార్ డమ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ ని మార్చగలడని నమ్మకం ఉన్నప్పటికీ ప్రస్తుతం అతను సక్సెస్ ట్రాక్ లో లేకపోవడంతో దైర్యంగా ఒకే చేయలేకపోతున్నారట. ఈ విషయంలో వీలైనంత త్వరగా ఎదో ఒక నిర్ణయానికి రావాలని మెగాస్టార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X