హీరోయిన్ లేకుండానే మెగాస్టార్ మూవీ? మాస్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నన్ని నాళ్ళు నిలిచిపోయే కొందరి హీరోల పేర్లలో మెగాస్టార్ చిరంజీవి తప్పకుండా ఉండి తీరుతుంది. చిరంజీవి ఇన్నేళ్ల ప్రయాణంలో ఇపుడు వరకు ఎన్నో సినిమాలు చేసి ఇపుడు తన 156వ సినిమాలో చేస్తున్నారు. కాగా ఇన్నేళ్ల కెరీర్ లో మెగాస్టార్ టచ్ చెయ్యని జానర్ గాని సబ్జెక్టు గాని లేదని చెప్పొచ్చు.

కాగా ఈ సినిమాల్లో ట్రెండ్ మారుతున్న కొద్దీ ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ వాటిని షేప్ అవుట్ చేస్తూ వచ్చారు చిరు. వీటిలో పలు రీమేక్ చిత్రాలు, స్ట్రైట్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి మెగాస్టార్ సినిమాలు అంటేనే ఒక ఆల్ రౌండ్ ప్యాకేజీలా అనే మార్క్ ఉంది. ఇపుడు ఉన్న ట్రెండ్ లో కూడా ఇదే మూస పద్దతిలో అంటే అందరూ థియేటర్స్ లోకి రావడం లేదు.

once again no heroine for megastar chiranjeevi this director planning crazy

అందుకే చిరు రీమేక్ సినిమాలు పక్కన పెట్టేసారు. స్ట్రయిట్ సినిమా చేసి హిట్ కొడితే ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్య తో చూపించారు. కానీ ఈ ఏజ్ లో కూడా యువ హీరోయిన్స్ తో సినిమాలు ఏంటి అనే కామెంట్స్ కూడా లేకపోలేవు. దీనితో ఇపుడు చేస్తున్న భారీ చిత్రమే "విశ్వంభర". యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న ఈ సినిమా పట్ల మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా తర్వాత కూడా మెగాస్టార్ నుంచి ఒక ఊహించని లైనప్ ఉండగా వీటిలో ఓ సినిమాకి అయితే చిరంజీవికి ఎలాంటి హీరోయిన్ ఉండదు అని ఇపుడు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో కంప్లీట్ మెగాస్టార్ రోల్ మీదే నడిచే పవర్‌ఫుల్ కథతో యువ దర్శకుడు మాస్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆ దర్శకుడు ఎవరో కాదు రీసెంట్ గా అనౌన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అట.

once again no heroine for megastar chiranjeevi this director planning crazy

మరి మొదటి సినిమా తోనే సత్తా చాటిన ఈ యువ దర్శకుడు తన కెరీర్ మూడో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్ అందుకున్నాడు. కాగా ఇపుడు ఈ ప్రాజెక్ట్ లోనే ఎలాంటి హీరోయిన్ గాని ఉండదు అని వినిపిస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో సంబంధం లేకుండా పాటలు కూడా ఉండవు అంటూ ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తుంది.

ఇలా మొత్తానికి మాత్రం కంప్లీట్ గా మెగాస్టార్ డామినేషన్ మీదే ఈ సినిమా నడుస్తుంది అని టాక్. కాగా చిరు నుంచి ఈ తరహాలోనే రీసెంట్ గా హీరోయిన్ లేకుండా తనకి ఎలాంటి డ్యూయెట్స్ లేకుండా చేసిన సినిమా ఒకటి ఉంది. ఆ చిత్రమే "గాడ్ ఫాదర్". అయితే ఈ సినిమా రీమేక్ కావడం మూలాన జనం మరీ అంత ఆసక్తి చూపించలేదు. దీనితో మళ్ళీ హీరోయిన్ లేకుండా వచ్చినా ఇపుడు చేసేది స్ట్రైట్ సినిమానే కాబట్టి కంటెంట్ క్లిక్ అయితే మళ్ళీ మెగాస్టార్ ర్యాంపేజ్ ఏంటో బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X