పవన్ పింక్ రీమేక్ టైటిల్ మళ్లీ మారింది.. పేరు మార్చాలని విశ్లేషకుల సూచన .. కారణం ఇదేనా.!
సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఏమాత్రం క్రేజ్‌ను కోల్పోలేదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన సినిమాలకు శాశ్వతంగా దూరమైపోతాడని ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే ఆయన పలుమార్లు ఇకపై సినిమాలు చేయనని ప్రకటించాడు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ మరోసారి సినిమాల్లోకి వస్తున్నాడు. ఇప్పటికే ఆయన పలు ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపేశాడు. తాజాగా పవర్ రీఎంట్రీ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.? ఆ సంగతులు చూద్దాం.!

ఒకేసారి మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో తీసుకున్న గ్యాప్‌ను ఫ్యాన్స్ మరిచిపోయేలా చేస్తున్నాడు. రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసింది. ‘పింక్' రీమేక్‌గా వస్తున్న సినిమాతో పాటు స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్, క్రిష్ జాగర్లమూడితోనూ ఆయన ప్రాజెక్టులు చేయనున్నాడు.

ఒకరకంగా పెద్ద సాహసమే చేస్తున్న పవన్
ఎవరైన హీరో చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. దీనికితోడు ఎలాంటి సినిమాను ఎంచుకున్నాడనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. కానీ, దీనికి భిన్నంగా ఆలోచించాడు పవన్. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' రీమేక్ మూవీతోనే అతడు రీఎంట్రీ ఇస్తున్నాడు. అందరికీ తెలిసిన కథతో రావడం పెద్ద సాహసమే అని అంటున్నారు.

ప్రకటించకుండానే పని ప్రారంభించేశాడు
పవన్ రీఎంట్రీకి సంబంధించిన వార్తలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అయినప్పటికీ పవర్ స్టార్.. తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానని మాత్రం ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ, సినిమా షూటింగ్‌లో మాత్రం పాల్గొంటున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన ‘పింక్' రీమేక్ మొదటి షెడ్యూల్‌లో అతడు పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలే ఇటీవల లీక్ అయ్యాయి.

మొదట అనుకున్నది మార్చాలని డిసైడ్
ఈ సినిమాకు మొదట ‘లాయర్ సాబ్' అనే టైటిల్ అనుకున్నారు. వాస్తవానికి ఇందులో పవన్ నటిస్తాడని తెలియక ముందే నిర్మాత దిల్ రాజు ఈ టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో రిజిష్టర్ చేయించారు. అయితే, ఇటీవల ఈ టైటిల్‌ను మార్చాలని అనుకున్నారు. ఇందుకోసం మరోసారి చాంబర్‌లో ‘వకీల్ సాబ్' అనే పేరును తమ సంస్థ పేరిట రిజిస్టర్ చేయించారు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.

పవన్ పింక్ రీమేక్ టైటిల్ మళ్లీ మారింది
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను ఉగాది రోజున రివీల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్ మరోసారి మారిందంటూ తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ‘పింక్' రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా టైటిల్ ‘వకీల్ సాబ్' కాదట. ఈ ప్రాజెక్టు కోసం ముందే రిజిస్టర్ చేయించిన ‘లాయర్ సాబ్'నే ఫైనల్ చేశారని అంటున్నారు.

పేరు మార్చాలని విశ్లేషకుల సూచన
ఇటీవల అనుకున్న ‘వకీల్ సాబ్' టైటిల్ న్యూమరాలజీ ప్రకారం అంత అనుకూలంగా లేదని చిత్ర యూనిట్‌కు కొందరు విశ్లేషకులు చెప్పారట. అంతేకాదు, దీని బదులు మొదట అనుకున్న ‘లాయర్ సాబ్' టైటిలే బాగుందని కూడా సలహా ఇచ్చారట. దీంతో చిత్ర యూనిట్ వెంటనే ఆ టైటిల్‌నే ఫిక్స్ చేసేసిందని సమాచారం. దీంతో సినిమా పేరుపై పవన్ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











