మరోసారి వెండితెరపై అనుష్క, ప్రభాస్ రొమాన్స్.. తెలివిగా ప్లాన్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్?

సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా బెస్ట్ కాంబినేషన్ గా గుర్తింపు అందుకున్న హీరో హీరోయిన్స్ లలో అనుష్క ప్రభాస్ కాంబినేషన్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన వీరు మరోసారి కలిసి నటిస్తే చూడాలి అని ఓవర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఒక టాలెంటెడ్ దర్శకుడు వీరిని మరోసారి వెండితెరపై క్యూట్ లవర్స్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

 నెమ్మదిగానే..

నెమ్మదిగానే..

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత చాలా వేగంగా మరికొన్ని ఫ్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. అలాగే బాహుబలి సినిమాలో నటించిన అందరూ కూడా చాలా బిజీగా మారిపోయారు. కానీ అనుష్క మాత్రం చాలా నెమ్మదిగానే సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. బాహుబలి అనంతరం ఆమె భాగమతి నిశ్శబ్దం సినిమాలు తప్పితే మరే ఇతర ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకి తీసుకురాలేకపోయింది.

 ఆఫర్స్ వచ్చినప్పటికీ..

ఆఫర్స్ వచ్చినప్పటికీ..

ఒక విధంగా అనుష్కకు బాహుబలి తర్వాత భారీ స్థాయిలో లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులలో నటించేందుకు ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఆమె పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎంతో బాగా నచ్చితే గాని సినిమా చేయడానికి ఆమె ఒప్పుకోవడం లేదు. ఇక చివరిగా నటించిన నిశ్శబ్దం సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

ఆ సినిమాతో బిజీగా

ఆ సినిమాతో బిజీగా


ఇక అనుష్క నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఆ సినిమాలో అనుష్క 35 ఏళ్ల పెళ్లి కాని మహిళలగా కనిపించబోతుందట. ఇక ఆమె ప్రేమలో పడిన పాతికేళ్ల కుర్రాడిగా నవీన్ పోలీస్ శెట్టి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ప్రభాస్ తో మరోసారి

ప్రభాస్ తో మరోసారి


అయితే ప్రభాస్ తో మరోసారి అనుష్క నటించే అవకాశం ఉన్నట్లు కూడా ఇండస్ట్రీలో మరొక టాక్ వినిపిస్తోంది. ఇదివరకే వీరి కలయికలో వచ్చిన బిల్లా మిర్చి బాహుబలి సినిమాలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరోసారి టాలెంటెడ్ దర్శకుడు మారుతి కూడా వీరిని ఏకం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే అనుష్కతో ఈ దర్శకుడు కథ విషయంలో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.

Recommended Video

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే.. కానీ..

గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే.. కానీ..

అనుష్క తన కొత్త చిత్రం కోసం ప్రస్తుతం బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే మారుతి కథ చెప్పగానే ఆమె సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాకపోతే కొంత సమయం కావాలని కూడా ఆమె అడిగినట్లు సమాచారం. మారుతి ప్రభాస్ తో హారర్ కామెడీ నేపథ్యంలో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారట. ఇక ఒక ప్రధాన హీరోయిన్ పాత్ర కోసం అనుష్కనే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X