గీత గోవిందం హీరోయిన్‌పై రూమర్స్.. నిజమే అంటూ!

యంగ్ బ్యూటీ రష్మిక మందన గీత గోవిందం చిత్రం సక్సెస్ తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. గీత గోవిందం చిత్రం ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. విజయ్ దేవర కొండా క్రేజ్, దర్శకుడు పరశురామ్ చిత్రాన్ని మలచిన విధానంతో సినిమా మరోస్థాయికి చేరింది. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య కెమిస్ట్రీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ లో అద్భుతమైన అవకాశాలతో దూసుకుపోతున్న రష్మిక గురించి కొంత కాలంగా సినీవర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజగా ఓ ఆంగ్ల దినపత్రికలో రష్మికపై వస్తున్న రూమర్స్ నిజమే అంటూ కథనం వెలువడింది.

 గత ఏడాదే

గత ఏడాదే

రష్మిక, కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నిశ్చితార్థం గత ఏడాది జరిగింది. ఆ ఎంగేజ్ మెంట్ బ్రేక్ అప్ అయిందని, వీరిద్దరూ విడిపోయారని కొంత కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్ నిజమే అంతో సదరు ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది.

బ్రేక్ అప్

బ్రేక్ అప్

ఇరు కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనించిన రష్మిక ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాను కెరీర్ పై దృష్టి పెట్టాలని రష్మిక భావిస్తోందట. కఠినమే అయినప్పటికీ రష్మిక అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్మిక సన్నితులే ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది.

మరిన్ని అవకాశాలు

మరిన్ని అవకాశాలు

గీత గోవిందం చిత్రం తరువాత రష్మిక తెలుగు, కన్నడ భాషల్లో మరిన్ని అవకాశాలు అంటుకుంటోంది. రష్మిక ప్రస్తుతం దేవదాస్, కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. రష్మిక, రక్షిత్ శెట్టి కలసి కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి నిశ్చితార్థం వరకు వెళ్ళింది.

 ఛలో చిత్రం

ఛలో చిత్రం

ఛలో చిత్రంతో టాలీవడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక చలాకి హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఆ తరువాత గీత గోవిందం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X