Varun Tej: మరోసారి వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ పెళ్లి మ్యాటర్.. ఆ నటితోనే అంటూ..
ఓ హీరో, హీరోయిన్ కలిసి నటించిన సినిమా హిట్ కాకపోయినా.. వాళ్లిద్దరూ వ్యక్తిగతంగా దగ్గరై జంటగా మారిన ఉదంతాల చాలానే సినీ రంగంలో ఉన్నాయి. మహేష్ బాబు, నమ్రత జోడీ వంశీ అనే మూవీ మేకింగ్ సమయంలో ఒకరికొకరు దగ్గరై తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ తరహాలో ఒక్కటైన జంట లిస్టు పెద్దగానే ఉంది. ఇలాగే తెలుగు సినీ రంగంలో మరో జంట కూడా ఒక్కటి కాబోతున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
హీరోయిన్ తో వరుణ్?:మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి దాకా వీళ్లిద్దరూ దీని గురించి స్పందించింది లేదు. ఎవరు, ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, కనీసం ప్రేమించుకున్నట్లు కూడా వెల్లడించక పోయినప్పటికీ.. వారిద్దరూ సీక్రెట్ గా నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి.

నాగబాబు చేసిన కామెంట్:అదంతా అబద్ధం అని ఆ తర్వాత కొంత కాలానికే తెలిసిపోయింది. కానీ తన కొడుక్కి అతి త్వరలో పెళ్లి చేయబోతున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు చెబుతున్నాడు. కానీ ఇప్పటికీ ఆయన పెళ్లి అయితే కన్ఫార్మ్ కావట్లేదు. అసలైతే గతంలో నిహారిక పెళ్లి అయిన నాలుగైదు నెలల్లోనే వరుణ్ పెళ్లి కూడా అవుతుందని నాగబాబు హింట్ కూడా ఇచ్చారు. అమ్మాయి కూడా ఫిక్స్ అయ్యింది అన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో మళ్ళీ మరో క్లారిటీ రాలేదు.

నిశ్చితార్థం కూడా..?:ఇది ఇప్పుడు వరుణ్, లావణ్య ప్రేమాయణం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారని.. ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కూడా కుదిరిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే నెలలలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు నిశ్చితార్థం కూడా జరగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు ఊపందుకున్నాయి.

బయట కనిపించింది లేదు కానీ..?:లావణ్య మెగా ప్యామిలీలో జరిగిన కొన్ని వేడుకల్లో కనిపించడం వరుణ్ కు ఆమెకు మధ్య ఏదో ఉందనే గుసగుసలు మొదలు అయ్యాయి. కానీ వరుణ్, లావణ్య కలిసి అయితే బయట ఎక్కడా కనిపించలేదు. వీరిద్దరి మధ్య ప్రేమా, పెళ్లీ ఏదీ లేదని కొందరు కొట్టి పడేస్తున్నా... తరచుగా ఈ జంట గురించి రూమర్లు అయితే ఆగట్లేదు. మరి ఈసారి ఏకంగా నిశ్చితార్థం అని వార్తలు వస్తుండగా... ఏం జరుగుతుందో చూడాలి మరి.

ఆ సినిమాతో బిజీగా వరుణ్ తేజ్:ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. చివరగా అతను గని, F3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఈసారి వరుణ్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవదారి అర్జున అనే ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ స్పై ఫిల్మ్ గా రానుంది. అలాగే ప్రసన్న కుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఫిక్స్ అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











