బయటకు చెప్పేలేక నయనతార నరకయాతన.. ఈ ఎఫైర్స్ ప్రేమ వరకేనా, పెళ్లికి పనికిరావా?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాధారణంగా హిరోయిన్స్ ఒకరితో రిలేషన్ లో ఉందంటే నెగిటివ్ ప్రచారాలు ఎక్కువవుతుంటాయి. అలాగే సినిమా కెరీర్ పై కూడా ఆ ఎఫెక్ట్ చాలానే ఉంటుంది. కానీ నయనతార మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.

రూమర్స్ ఎన్ని వచ్చినా...
నయనతార తన సినీ జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్స్ కంటే కూడా పర్సనల్ లైఫ్ సంఘటనలతోనే ఎక్కువగా అందరిని ఆకర్షించింది. ప్రేమ వ్యవహారలతో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే ఈ భామపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా తన క్రేజ్ ని తగ్గించుకోలేదు. ఆ ప్రభావం సినిమాలపై పడకుండా నటిగా క్రమశిక్షణతో మెలిగింది.

మీడియాకు దూరంగా..
సాధారణంగా నయనతార మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. సినిమా చేయడానికి ఒప్పుకునే ముందు ప్రమోషన్స్ లో పాల్గొనలేనని అమ్మడు ముందుగానే ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఇక మీడియాలో తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా ఈ బ్యూటీ ఎంత మాత్రం పట్టించుకోదు. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.

మరోసారి బ్రేకప్..
ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో విఫలమైన నయనతార మరోసారి బ్రేకప్ చెప్పినట్లు తమిళ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో గత కొంతకాలంగా రొమాంటిక్ లైఫ్ ని గడుపుతున్న నయనతార ఇటీవల విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయాన్ని కావాలనే అమ్మడు బయటపెట్టడం లేదని కూడా టాక్ వస్తోంది.

నయన్ నరకయాతన..
బ్రేకప్ చెప్పిన తరువాత నయన్ ఆ విషయాన్ని బయటకు చెప్పలేక నరకయాతన అనుభవిస్తున్నట్లు కూడా కోలీవుడ్ లో టాక్ రావడం గమనార్హం. దీంతో నయన్ ఎఫైర్స్ ప్రేమ వరకేనా పెళ్లికి పనికిరావా..? అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే నయన్ మాత్రం ఇలాంటి విషయాల్లో పెద్దగా సీక్రెట్ మెయింటైన్ చేసే రకం కాదని చెప్పవచ్చు. గతంలో ఆమె లవ్ ట్రాక్స్ గురించి అందరికి తెలిసిందే కాబట్టి అమ్మడు ఈ సారి అంత ఈజీగా బ్రేకప్ చెప్పదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











