ప్రభాస్ పెళ్లి గోల.. వామ్మో.. ఈ సారి వచ్చిన గాసిప్ డోస్ మామూలుగా లేదు

రెబల్ స్టార్ ప్రభాస్ వయసు ప్రస్తుతం 41. ఇక ఆయన పెళ్లిపై పదేళ్ల నుంచి రూమర్స్ వస్తునే ఉన్నాయి. అప్పుడెప్పుడో 28 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా వాటికి ఎండ్ కార్డ్ పడటం లేదు. ప్రభాస్ పెళ్లి చేసుకునే సరికి ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ఫ్యాన్స్ నమ్మడానికి ఆసక్తి చూపడం లేదు. ఇక ఇటీవల వచ్చిన ఓ గాసిప్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. కొన్ని వెబ్ మీడియాలలో అయితే అదే నిజమని స్టోరీలు అల్లేస్తున్నారు.

 చాలాసార్లు కుండబద్దలు కొట్టేశారు

చాలాసార్లు కుండబద్దలు కొట్టేశారు

ప్రభాస్ కెరీర్ లో ఎక్కువగా అతని సినిమాల కంటే పెళ్లిపైనే గాసిప్స్ ఎక్కువగా పుట్టుకొచ్చాయి. టాప్ హీరోయిన్స్ తో కూడా లవ్ ఎఫైర్ అంటూ ఊహాలకందని రేంజ్ లో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఎక్కువగా అనుష్కపైనే రూమర్స్ రావడం రొటీన్ అవుతూ వచ్చింది. ఇక వాటిల్లో నిజం లేదని వారిద్దరూ చాలా సార్లు కుండబద్దలు కొట్టేశారు.

కృష్ణంరాజు కూడా సహనం కోల్పోయి..

కృష్ణంరాజు కూడా సహనం కోల్పోయి..

ఇక ప్రభాస్ ఫ్యామిలీలో ప్రభాస్ పెళ్లిపై ఒకప్పుడు గంటల తరబడి చర్చలు జరిగేవట. మిర్చి సినిమా తరువాత అవుతుంది. బహుబలి తరువాత సెట్టవుతుంది అంటూ కృష్ణంరాజు కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక చివరికి ఆయన కూడా ఆ విషయంపై సహనం కోల్పోయి పెద్దగా ఆలోచించడం లేదని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీగా అర్ధమయ్యింది. ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది అంటూ మ్యాటర్ ను డైవర్ట్ చేసేశారు.

వామ్మో ..మరొక రూమర్

వామ్మో ..మరొక రూమర్

ఇక చాలా రోజుల తరువాత మళ్ళీ రెబల్ స్టార్ పెళ్లిపై ఎవరు ఊహించని విధంగా కొత్త రూమర్ ఒకటి వైరల్ గా మారింది. కృష్ణం రాజు సతీమణి సన్నిహితులైన వారి ఫ్యామిలీ నుంచి అమ్మాయిని రాజుగారి ఇంట్లోకి కోడలిగా ఆహ్వానిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరికొన్ని వివరాలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

అమెరికాలోని తెలుగమ్మాయి..

అమెరికాలోని తెలుగమ్మాయి..

ప్రభాస్ కు పిల్లను ఇవ్వబోయే వారి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా అని తెలుస్తోంది. ఇక వాళ్ళు గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నారట. అమ్మాయి తండ్రికి అమెరికాలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీతో పాటు ఇతర బిజినెస్ లు కూడా బాగానే ఉన్నాయట. ఇక పెళ్లి విషయంపై ఇటీవల కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్లు కథనాలు వస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని జనాలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X