ఐటెం సాంగ్స్ నే నమ్ముకున్న స్టార్ హీరోయిన్.. ఆ సినిమాతో రీఎంట్రీ?

సినీ పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడూ ఎవరూ ఊహించలేం అని చెప్పాలి. ఒకప్పుడు భారీ స్టార్డం ఉన్నవాళ్లు ఇప్పుడు సినిమాల్లో అరకొరగా కనిపిస్తూ చిన్న చిన్న పాత్రలకి పరిమితం అయ్యిపోయారు. అయితే మేల్ ఆర్టిస్టులు ఏదొకలా సర్వైవ్ అయ్యిపోతారు కానీ ఫీమేల్ ఆర్టిస్టులు మాత్రం ఒకింత కష్టమే అని చెప్పాలి. అందులోని హీరోయిన్ గా పరిచయం అయ్యిన వాళ్ళు అయితే ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన పరిస్థితి.

ఒక సమయంలో హీరోయిన్స్ గా చేసి తర్వాత అవకాశాలు లేక బి గ్రేడ్ సినిమాలు, ఐటెం సాంగ్స్ కూడా చేయని వారు లేకపోలేరు. ఇంకా ఇండస్ట్రీలో ఏదొక రకంగా సర్వైవ్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. అందుకు ఒకోకరు ఒకో మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే కొన్నేళ్లు వెనక్కి వెళితే అప్పుడు ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు హీరోయిన్ గా కాదు కదా చిన్న చిన్న పాత్రల్లో కూడా కనిపించడం మానేశారు.

once again south senior heroine shriya saran pins hopes in item songs only

అలాంటి హీరోయిన్స్ లో హాట్ బ్యూటీ శ్రేయ శరన్ కూడా ఒకరు. కాగా శ్రేయ టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోస్ స్టార్ హీరోస్ తో కూడా కెరీర్ స్టార్టింగ్ లో చేసేంది. ఒక్క తెలుగేనా తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి స్టార్ తో కూడా చేసింది. కానీ తర్వాత కెరీర్ పరంగా తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఆమెని వెనక్కి లాగేసాయి. వాటిలో మల్లన్న సినిమాలో రోల్ చాలా పెద్ద మిస్టేక్ ని ఆమె చెబుతూ ఉంటుంది.

దీనితో అలా హీరోయిన్ గా అవకాశాలు తక్కువే సొంతం చేసుకుంటున్న శ్రేయ పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. పవన్ తో "పులి", వెంకటేష్ తో "తులసి" ఇలా పలు చిత్రాల్లో ఐటెం గర్ల్ గా శ్రేయ రెచ్చిపోయింది. అయితే చివరి సారిగా ఒక నటిగా అయితే భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలో పాలు పంచుకుంది.

once again south senior heroine shriya saran pins hopes in item songs only

అయితే ఇప్పుడు మళ్ళీ ఓ సినిమా కోసం ఐటెం భామగా శ్రేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా పలు రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. తమిళంలో హీరో సూర్య నటిస్తున్న తాజా సినిమాకి శ్రేయ స్పెషల్ సాంగ్ కోసం సైన్ చేసిందట. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆమెని అప్రోచ్ కాగా ఆ సాంగ్ కి ఆమె ఓకే చేసినట్టుగా ఇపుడు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

దీనితో శ్రేయ ఈ రకంగా మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. గతంలో సూర్యతో శ్రేయ సినిమాలు చేసిన సందర్భాలు లేవు సో ఇదే వారి మొదటి కలయిక అని చెప్పాలి. మరి దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక క్లారిటీ కూడా ఇవ్వొచ్చని వినిపిస్తుంది. కాగా శ్రేయ రీసెంట్ గా హిందీలో దృశ్యం 2 అలాగే కన్నడ సినిమా కబ్జా లో కనిపించింది. ఇప్పుడు సూర్య సినిమా వార్తలు నిజం అయితే ఇందులో కనిపించనుంది అని చెప్పొచ్చు. మరి దీనితో అయినా శ్రేయకి అనుకున్న బ్రేక్ వస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X