కోటీ రూపాయలా ఎవరు ఇచ్చారు..?ఎవరు పుచ్చుకొన్నారు..?
రామ్ చరణ్ తేజ సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ తరువాత వివి వినాయక్ డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు 'ఏ మాయ చేసావే", 'బృందావనం", 'దూకుడు" వరుసగా మూడు హిట్ సినిమాలలో నటించిన హీరోయిన్ సమంతకు కోటి ఇవ్వడానికి నిర్మాత ఒకే అన్నారని ప్రచారం జరిగింది.
సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తెలుగు ఫిల్మిం ఇండస్ట్రీలో పేరుతెచ్చుకొన్న క్యూట్ సమంతని దర్శకుడు గౌతమ్ మీనన్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'ఏ మాయ చేసావె"తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత 'దూకుడు" చిత్రంతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రాజమౌళి 'ఈగ' , నాగ చైతన్య 'ఆటో నగర్ సూర్య' సినిమాలలో కూడా నటిస్తుంది.
అయితే వాస్తవం ఏమిటంటే రామ్ చరణ్-వివి వినాయక్ సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరు అనేది కన్ ఫార్మ్ కాలేదు. సమంతాను ఎంచుకోవడానికి అవకాశం మాత్రం వుంది. పారితోషికం రూమర్స్ కు ఓ ప్రముక పత్రికలో ఆమె చెప్పిన సమాధానం చాలా బాగుంది.
నేను చేసిన సినిమాలు విజయం సాధించాయి అంటే అది కేవలం నా ప్రతిభే ఎలా అవుతుంది ? దర్శకుడు, కథా నాయకుడు.. అందరి భాగస్వామ్యం వల్లే ఆయా సినిమాలు ఆడాయి. అందులో నేను కాకుండా మరో కథానాయిక ఉన్నా అదే ఫలితం వచ్చేది. విజయాలను అదనుగా తీసుకోని పారితోషికం విషయంలో పట్టింపులకు పోవడం నాకు నచ్చదు అంటోంది హ్యాట్రిక్ హీరోయిన్ సమంత.


Click it and Unblock the Notifications











