సమంతకి కోటి రూపాలయ ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్..!?
సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తెలుగు ఫిల్మిం ఇండస్ట్రీలో పేరుతెచ్చుకొన్న క్యూట్ హీరోయిన్ సమంతని దర్శకుడు గౌతమ్ మీనన్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'ఏ మాయ చేసావె"తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత 'దూకుడు" చిత్రంతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా దూకుడు సూపర్ డూపర్ హిట్ కావడంతో సమంత కూడా కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయిందని అంటున్నారు.
సినిమా హిట్ అయ్యిందంటే చాలు, రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోతుంది. (మరి సినిమా ఫ్లాఫ్ అయితే రెమ్యునరేషన్ తగ్గించుకుంటారా అని అడక్కండి...) తాజాగా సమంతా కూడా అదే బాటలో నడుస్తుంది. దూకుడు వసూళ్ళ పరంగా సెన్సేషనల్ హిట్ కావడంతో సమంతా రేటు పెంచేసింది. తనకూ కోటి కావాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పటి వరకు తెలుగులో కేవలం ఇలియానా, అనుష్క మాత్రమే కోటి రూపాయలు తీసుకున్న వారిలో ఉన్నారు. కాజల్ కూడా కోటి తీసుకుంటుందని ప్రచారంలో ఉన్నా, నిర్మాతలు ఇచ్చేందుకు రెడీగా లేరు. తాజాగా సమంతా కూడా కోటి తీసుకోవాలని డిసైడ్ అయ్యిందట.
తాను చేసిన 'ఏ మాయ చేసావే", 'బృందావనం", 'దూకుడు" వరుసగా మూడు హిట్లు అవడంతో కోటి తీసుకోవడానికి కావాల్సిన అర్హత దక్కినట్టేనని అనుకుంటుందట. ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ తరువాత వివి వినాయక్ డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో సమంతానే హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారట. ఈ సినిమాలో నటించేందుకు కోటి ఇవ్వడానికి నిర్మాత కూడా ఒకే అన్నారట, ఎందుకంటే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ప్రతీ సినిమా సక్సెస్ కి హీరోయిన్ కూడా కారణం అవుతోంది కాబట్టి గోల్డెన్ లెగ్ హీరోయిన్ అని టాలీవుడ్ లో పేరుతెచ్చుకొంటోంది. ఈ సినిమాలో సమంతాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల నుండి అంది సమాచారం.


Click it and Unblock the Notifications











