మరోసారి ఆ అగ్ర హీరోతో త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్ సినిమాపై కొత్త డౌట్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. అయితే చాలా సార్లు కూడా ఈ దర్శకుడు అనుకున్న ప్రాజెక్టును వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేలేకపోతున్నాడు. అల.. వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నప్పటికి కూడా తన తదుపరి ప్రాజెక్టు విషయంలో మాత్రం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. మహేష్ బాబుతో ఒక ప్రాజెక్టును అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా సినిమాపై మరో ఆప్డేట్ ఇవ్వలేదు. ఇంతవరకు మహేష్ కూడా ఆ ప్రాజెక్ట్ పై పెద్దగా స్పందించింది లేదు. ఇక ఇటీవల మరొక కొత్త టాక్ అయితే ఈ సినిమాపై కొత్త అనుమానాలు క్రియేట్ చేస్తోంది.

అజ్ఞాతవాసి ప్రభావం

అజ్ఞాతవాసి ప్రభావం

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని చాలామంది హీరోలు కోరుకుంటారు. వీలైనంత వరకూ సేఫ్ జోన్ లోనే కమర్షియల్ పాయింట్స్ తో త్రివిక్రమ్ బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆయనతో నిర్మాతలు హీరోలు సినిమా చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు అయితే అజ్ఞాతవాసి ప్రభావం తర్వాత కథ నచ్చితేనే సినిమా చేసేందుకు ఒప్పుకుంటున్నారు. కొందరు మాత్రం త్రివిక్రమ్ పై నమ్మకంతో కథ పై అనుమానాలు ఉన్నా కూడా వెంటనే ఒప్పేసుకున్నారు.

మహేష్ ఇంకా ఫైనల్ చేయలేదా?

మహేష్ ఇంకా ఫైనల్ చేయలేదా?


త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు ఎంత వరకు గ్రీన్సిగ్నల్ ఇచ్చాడో అనేది తెలియదుగానీ హారిక హాసిని ప్రొడక్షన్లో మాత్రం మహేష్ తో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే ఆ సినిమా చేయబోతున్నట్లు మహేష్ బాబు కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం విశేషం. కథ పై కొన్ని అనుమానాలతో మహేష్ మార్పులు చేయమని కూడా కోరినట్లు అయితే వచ్చింది.

అల్లు అర్జున్ తో మరో సినిమా

అల్లు అర్జున్ తో మరో సినిమా

మహేష్ బాబు ఎంత వరకు ఒప్పుకున్నాడో తెలియదు కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మరొక హీరోపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల యువ నిర్మాత నాగ వంశీ ఒక ప్రత్యేకమైన ట్వీట్ చేశాడు. తమన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఒక ఫోటోకు స్టిల్ వచ్చిన ఈ యువ నిర్మాత త్వరలోనే ఒక సర్ ప్రైజ్ రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి.

Recommended Video

Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
మహేష్ సినిమా లేనట్లేనా?

మహేష్ సినిమా లేనట్లేనా?


దర్శకుడు విక్రమ్ శ్రీనివాస్ ఇదివరకే అల్లు అర్జున్ తో మూడు సినిమాలు చేశాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా అల వైకుంఠపురములో సినిమా తెలుగులో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. మొదటిసారి అల్లు అర్జున్ సినిమా 200 కోట్ల బిజినెస్ చేసింది. 4వ సారి ఈ కాంబినేషన్లో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అల్లు అర్జున్ తో సినిమా సెట్ అయింది అంటే మహేష్ బాబు సినిమా కొంత వాయిదా పడే అవకాశం ఉంది అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X