ప్రభాస్, రానా మరో మల్టీస్టారర్.. ఒకే అయితే రచ్చే!
Recommended Video

టాలీవుడ్ లో మల్టి స్టారర్ చిత్రాల జోరు పెరుగుతోంది. ఎన్టీఆర్, రాంచరణ్.. నాగ్, నాని.. వెంకీ, వరుణ్.. ఇలా స్టార్ హీరోలంతా మల్టి స్టారర్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటిస్తే ఈ చిత్రంపై అంచనాలు తప్పకుండా రెట్టింపు అవుతాయి. ప్రభాస్, రానా కలసి బాహుబలి రెండు భాగాల్లో నటించారు. ఈ బడా హీరోలిద్దరూ మరో మారు వెండి తెరపై మెరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిస్టర్ పర్ఫెక్ట్ దర్శకుడితో
సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి విజయవంతమైన చిత్రాలు నడిచి కె దశరథ్ మరో మారు ప్రభాస్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తెరకెక్కించిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఘనవిజయం సాధించింది.

మల్టీస్టారర్ కథ
దశరథ్ ఈ సారి ప్రభాస్, రానా కోసం ఓ కథని సిద్ధం చేసుకున్నారట. వీరిద్దరిని మరో మారు కలసి నటింపజేయాలనేది ఆయన ఆలోచన. కథని చాలా ఆసక్తికరమైన అంశాలతో సిద్ధం చేశానని.. ప్రభాస్, రానా ముందు తన ఆలోచన బయటపెట్టినట్లు తెలుస్తోంది.

వెంటనే కుదరకపోవచ్చు
కానీ దశరథ్ ఆలోచన వెంటనే కార్యరూపం దాల్చకపోవచ్చు. ఎందుకంటే ప్రభాస్, రానా ప్రస్తుతం బాగా బిజీగా ఉన్నారు. ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తుండగా, రానా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

విజయాలకు దూరంగా
ఇటీవల దశరథ్ కు సరైన విజయం దక్కలేదు. శౌర్య, గ్రీకువీరుడు వంటి చిత్రాలు నిరాశపరిచాయి. రచయితగా పలు చిత్రాలకు పనిచేసిన దశరథ్ నాగార్జున సంతోషం చిత్రంతో దర్శకుడిగా మారి విజయం దక్కించుకున్నాడు.


Click it and Unblock the Notifications











