BRO: బ్రో మూవీ ఫైట్స్‌పై షాకింగ్ లీక్.. దీన్ని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?
తెలుగులో ఇప్పుడు మల్టీస్టారర్లు, రీమేక్ మూవీలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ కొన్ని మల్టీస్టారర్ సినిమాలను కూడా మన భాషలోకి అనువదిస్తున్నారు. ఇప్పుడలా తెరకెక్కుతోన్న చిత్రమే 'బ్రో (BRO)'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్'కు రీమేక్‌గా సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. మెగా హీరోల కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న 'బ్రో (BRO)' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఫిబ్రవరిలోనే ప్రారంభం అయింది. ఆ వెంటనే వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేసుకుని.. టాకీ పార్టును ఎవరు ఊరించనంత వేగంగా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా ప్రచారంపై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే టీజర్‌తో పాటు రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో హైప్ పెరుగుతూనే ఉంది.

డివోషనల్ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'బ్రో (BRO)' మూవీ నుంచి తరచూ ఏదో ఒక అంశం లీక్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలోని ఫైట్ల గురించి ఊహించని వార్త బయటకు వచ్చింది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క ఫైట్ ఉంటుందట. అందులో సాయి ధరమ్ తేజ్‌తో పాటు పవన్ కల్యాణ్ కూడా కనిపిస్తారని తెలిసింది. వీళ్లిద్దరూ కలిసి చేసే ఈ ఫైట్ దాదాపు ఐదు నిమిషాల వరకూ ఉంటుందట. ఇది సినిమాలోని మేజర్ హైలైట్లలో ఒకటిగా ఉంటుందని అంటున్నారు.
మెగా హీరోలు నటిస్తున్న 'బ్రో (BRO)' మూవీలో ఒక్కటే ఫైట్ ఉంటుందన్న వార్త లీక్ అవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. వాస్తవానికి పవన్ సినిమాలో ఫైట్స్ ఎంతో స్టైలిష్‌గా ఉంటాయి. కానీ, ఈ చిత్రంలో ఒక్కటే యాక్షన్ సీక్వెన్స్ ఉందన్న వార్తను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ, ఈ మూవీలో పవర్ స్టార్ ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయని టాక్.

పవన్, సాయి తేజ్ కాంబోలో వస్తున్న 'బ్రో (BRO)' చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీన్ని జూలై 28న రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











