కృష్ణ సూపర్ హిట్ మహేష్ తో రీమేక్
అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఊరికి మొనగాడు (1981) చిత్రం ఇప్పుడు అజయ్ దేవగన్ తో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత విషు భగ్నాని ఈ చిత్రం రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారుయ. అయితే విషయమేమిటంటే ఊరికి మొనగాడు చిత్రం ఆల్రెడీ ఒకసారి హిమ్మత్ వాలాగా రీమేక్ అయ్యింది. ఆ చిత్రాన్ని అప్పట్లో కె.రాఘవేంద్రరావు డైరక్ట్ చేసారు. హిమ్మత్ వాలా చిత్రం శ్రీదేవికి తొలిసారి బ్రేక్ ఇచ్చింది.ఇక హిందీలోకి మరోసారి రీమేక్ అవుతున్న ఈ సమయంలో మహేష్ తో ఈ చిత్రం రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే టాక్స్ కూడా మరో ప్రక్క నడుస్తున్నాయి.జయంత్ ఈ చిత్రం రీమేక్ చేయాలనే ఆలోచనలో మహేష్ ని కలిసినట్లు సమాచారం. మహేష్,జయంత్ కాంబినేషన్ లో గతంలో టక్కరి దొంగ చిత్రం వచ్చింది. అయితే మహేష్ ఇప్పటివరకూ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ఇప్పటికాలానికి స్క్రిప్టు ఎలా మారుస్తారో తెలిస్తే ఆలోచిస్తానన్నట్లు తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం దూకుడు చిత్రంపైనే దృష్టి మొత్తం పెట్టారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో లో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
దూకుడు గురించి రచయిత గోపీ మోహన్ మాట్లాడుతూ..."ఇప్పటివరకు మనం సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చాం. కామెడీ సీన్లలో తప్ప పవర్‌ఫుల్ డైలాగ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చెయ్యలేదు. ఈ సినిమా దానికి లాంచింగ్‌గా ఉండాలి. ఇక నుంచీ మనల్ని కూడా అలాంటి డైలాగ్స్ పెట్టమనేటట్లుండాలి" అని. ఇందులో డైలాగ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ వచ్చేసరికి శ్రీను వైట్ల తరహాలోనే ఉంటాయి. యాక్షన్, పవర్‌ఫుల్ సైడ్ వచ్చేసరికి మహేశ్ తరహాకి మేం వెళ్లాం. ఆయన కూడా అదే స్టైల్‌కి మలుచుకుని చెప్పారు. ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











