జూ.ఎన్టీఆర్ ఒత్తిడితోనే ‘ఊసరవెళ్లి’ ఆడియో
ఊసర వెళ్లి ఆడియో రిలీజ్ వేడుకను ఈ రోజు(సెప్టెంబర్ 15)న శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం....జూ.ఎన్టీఆర్ ఒత్తిడి మేరకే ఈ సినిమా ఆడియో వేడుక ఇంత హడావుడిగా చేస్తున్నారని సమాచారం. అక్టోబర్ 6న సినిమా విడుదల చేస్తున్నట్లు వెలువడిన ప్రకటన కూడా జూనియర్ బలవంతం మీదనే విడుదల చేశారట.
వాస్తవానికి ఊసరవెళ్లి షూటింగ్ 30% కూడా పూర్తి కాలేదనే వాదన ఆ సినిమా యూనిట్ సభ్యుల నుంచి వినిపస్తోంది. దీపావళి వరకు అయితే సినిమాను హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చని నిర్మాతలతో పాటు, దర్శకుడు సుంరేదర్ రెడ్డి జూనియర్ నచ్చజెప్పినా ఆయన వినలేదని, దసరా సెలవుల సీజన్ వదులకోవడానికి జూనియర్ సిద్దంగా లేక పోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో...ఊరసవెళ్లి షూటింగ్ గత కొన్ని రోజుల నుంచి ఆగమేఘాల మీద జరుపుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇలా ఆదరబాదరాగా షూటింగ్ జరుపుకుంటే సినిమా ఆగం అవ్వడం ఖాయం అని సినీ విశ్లేషకులు వాదన. మరి ఊసరవెళ్లి గతేమవుతుందో? చూడాలి.


Click it and Unblock the Notifications











