'ఊసెరవెల్లి' రిజల్టు కి బోయపాటి శ్రీను రిలీఫ్
వరస పరజయాల్లో ఉన్న బాలకృష్ణకు సింహాతో సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ని పిలిచి తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దమ్ము టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో తదుపరి షెడ్యూల్ కి వెళ్లనుంది. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను చాలా ఉత్సాహంగా ఉన్నాడని సినీ జనం కామెంట్స్. కారణం ఊసరవెల్లి చిత్రం ఊహించని విధంగా సూపర్ హిట్ కాకపోవటమే అంటున్నారు. దాంతో తన సినిమాకు విపరీతమైన ఎక్సపెక్టేషన్స్ పెరిగి ఇబ్బందుల్లోకి తోయదని శ్రీను భావిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఊసరవెల్లి గనుక దూకుడు రేంజిలో మెగా హిట్ అయ్యుంటే పెరిగిన ఆ ఎక్సపెక్టేషన్స్ కు అణుగుణంగా చాలా శ్రమ పడాల్సి వచ్చేదని రిలీఫ్ ఫీలయ్యాడని అంటున్నారు. కంటిన్యూ ప్లాప్ ల్లో ఉన్నాడు కాబట్టే బాలకృష్ణ తో తను తీసిన చిత్రం ఓ ప్రత్యేకత సంతరించుకుందని, ఆ సినిమా హిట్ ని పరిశ్రమ,అభిమానులు ఓ రేంజిలో సెలబ్రేట్ చేసుకున్నారని, అలా లేకపోయినా ఊసరవెల్లి నిరాశపరచటం ఇప్పుడు బోయపాటి శ్రీను హిట్ కొట్టాల్సిన భాధ్యత పెంచినా ఎక్సపెక్టేషన్స్ పెంచకుండా ఉందనేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications











