'ఊసరవెల్లి' యూనిట్ కు కొత్త బెంగ
ఎన్టీఆర్ ఊసరవెల్లి చిత్రం మొన్న దసరా రోజున విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డివైడ్ టాక్ తో విడుదలైంది. అందులోనూ ఈ రోజుల్లో చిత్రం హిట్టైందంటే వెంటనే రీమేక్ రైట్స్ కోసం ఎంక్వైరీ బాలీవుడ్ నుంచి తమిళ్ నుంచి మొదలవుతోంది. తాజాగా హిట్టైన దూకుడు చిత్త్రం రీమేక్ రైట్స్ ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఊసరవెల్లి చిత్రం రీమేక్ రైట్స్ కోసం ఏ బాష నుంచి ఎవరూ రావటం లేదట. అది యూనిట్ సభ్యులు ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏ రేంజి రీమేక్ రైట్స్ పలకాయన్న దానిపైనే చిత్రం హిట్ రేంజి ని అంచనా వేస్తున్న ఈ రోజుల్లో ఊసరవెల్లి గురించి ఎవ్వరూ మాట్లాడకపోవటం ఇబ్బందికర అంశమే అంటున్నారు.
ఇక దూకుడు విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ హిందిలో చేయటానికి ఆసక్తి చూపుతుంటే తమిళంలో అజిత్ చేయటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే మరో ప్రక్క ఈ చిత్రం కోసం ప్రెస్ మీట్ పెట్టి దర్శకుడు ... ఈ దసరాను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. తొలిరోజే మా సినిమా భారీవసూళ్లను అందించి అందరికీ ఆనందాన్నిచ్చింది. మా హీరో, నిర్మాతలదే ఆ క్రెడిట్ అన్నారు . అలాగే ఒక్క తొలిరోజే 15కోట్ల 75లక్షల గ్రాస్ వసూలు చేసి 'ఊసరవెల్లి" సరికొత్త రికార్డ్ సృష్టించిందని పంపిణీదారుడు, నిర్మాత కె.అచ్చిరెడ్డి తెలిపారు.
రాయలసీమలో 2కోట్ల 92లక్షలు, నైజామ్‌లో 3కోట్ల 73లక్షలు, నెల్లూరులో 49లక్షలు, గుంటూరులో కోటి 43లక్షలు, కృష్ణలో 75లక్షలు, విశాఖలో 66లక్షలు, తూ.గో జిల్లాలో 71లక్షలు, ప.గో జిల్లాలో 63లక్షలు, అమెరికాలో కోటి 98లక్షలు, ఇతరచోట్ల (ఒరిస్సా, చెనై్న, మహారాష్ట్ర, ఉత్తరభారతం)..కోటి 30లక్షల వసూళ్లు సాధించిందని వివరాలు వెల్లడించారు. ఇక నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ భారీ విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











