అభిమాని కోసం స్వయంగా రంగంలోకి జూ ఎన్టీఆర్...!?

By Sindhu

యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా నటించిన చిత్రం ఊసరవెల్లి. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రానికి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. విడుదలకు ముందే ఈ చిత్రం మంచి ఊపు అందుకుంది. భారీ గా అంచనాలు ఉన్న ఈ చిత్రం ప్రదర్శన హక్కులను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ బ్రహ్మాండమైన రేటు ఇచ్చి దక్కించుకుంది.

అయితే ఇప్పుడు సరికొత్త మలుపు ఒకటి వెలుగు లోకి వచ్చింది. విశాఖపట్నం లో జూ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు ఈ చిత్రం కథ, నిర్మింపబడిన తీరు చూసి బాగా ఇష్టపడ్డాడు అట. ఎలాగైనా ఈ చిత్రం ప్రదర్శన హక్కులను విశాఖపట్నం వరకు అయినా దక్కించుకోవాలని పట్టుదలతో విశ్వప్రయత్నం చేసాడంట. అయితే అప్పటికే హక్కులను పొందిన ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ, నిర్మాత ప్రసాద్ తో స్వయంగా జూ ఎన్టీఆర్ సంప్రదించి తన అభిమానికి విశాఖపట్నం హక్కులను ఆ వ్యక్తికి ఇప్పించినట్టు సమాచారం. ఈ వీరాభిమానికే సుమారు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలకు ఇచ్చేసారని సమాచారం. ఫిలింనగర్ లో సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పుకుంటూ ఉండటం తో ప్రదర్శన హక్కులకు గిరాకి బాగా పెరిగిపోయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X