రామ్ చరణ్ హ్యాట్రిక్ ‘మగధీర’ రేంజ్ లో కొడతాడనే అంచనాలు...!
'ఆరెంజ్" సినిమా ఎలా ఉంటుందో కానీ పాటలు మాత్రం బాగా పాపులర్ అయ్యాయి. విడుదలయింది లగాయతు ఆరెంజ్ పాటల్ని జనం వేలంవెర్రిగా వినేస్తున్నారు. ఎఫ్ ఎంలో, రింగ్ టోన్స్ లో, కాలర్ ట్యూన్స్ లో ఎక్కడ విన్నా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. చరణ్ నటించిన తొలి రెండు చిత్రాల ఆడియోలను మార్కెట్ చేసిన ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ఇప్పుడీ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ సాధించింది.
ఆడియో సేల్స్ లో ఇటీవలి కాలంలో 'మగధీర" రేంజ్ లో ఏ ఆడియో సక్సెస్ కాలేదు. 'ఆరెంజ్" కూడా ఆ రేంజ్ లో హిట్ అయ్యే దిశగా దూసుకుపోతుందని, సినిమా బాగుంటే కనుక ఇక ఈ పాటల విజయాన్ని అంచనా వేయడం కూడా కష్టమని ఆదిత్య మ్యూజిక్ యాజమాన్యం అంటోంది. పాటలు సూపర్ హిట్ కావడంతో 'ఆరెంజ్" రూపకర్తలకి కూడా ఉత్సాహం రెట్టింపయింది. ఒక్క మాస్ పాట కూడా లేకపోయినా ఆడియోకి బ్రహ్మాండమైన స్పందన రావడంతో ఈ క్లాస్ సినిమాకి ఏ క్లాస్ విజయం దక్కుతుందనే నమ్మకం వారిలో పెరిగింది..


Click it and Unblock the Notifications











