ఆరంజ్ ఖర్చుకు బెంబెలెత్తుతున్న బాబాయి..
మొన్నటి వరకు తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఖలేజా మరియు బృందావనం గురించి మాట్లాడుకున్నారు. ఇక మీదట మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆరంజ్ ఆడియో రిలీజ్ అక్టోబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈసినిమా దర్శకుడు బోమ్మరిల్లు భాస్కర్ ఖాతాలో ఇప్పటికే రెండు హిట్ సినిమాలు ఉండగా మూడవసినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలనే తాపత్రయంతో చరణ్ బాబుని చాలా కొత్తగా డిపరెంట్ స్టయిల్లో చూపించడానికి సిధ్దం అయ్యారు.
ఇక సినిమా విషయానికి వస్తే ఆరంజ్ చిత్రం మాత్రం నిర్మాత నాగబాబుకి ఓ పరీక్ష లాగా తయరయ్యిందంట. దానికి కారణం మొన్నటివరకు ఈసినిమా షూటింగ్ ఆస్టేలియాలోనే జరుపుకోని రావడం జరిగింది. ఐతే మరలా ఈసినిమాకి సంబంధించిన కొన్ని పతాకసన్నివేశాలను మరలా రూపోందించడానికి ఆస్ట్రేలియా వెళ్శడం జరిగిందంట. దానితో ఈసినిమాకి అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అవ్వడంతో నిర్మాత నాగబాబు కోంచెం భయాందోళనకు లోనవుతున్నాడంట. మరోక ప్రక్క చూసుకుంటే ఆబ్బాయ్ రామ్ చరణ్ కికొత్త లుక్ ఇవ్వాలంటే ఆమాత్రం ఖర్చుపెట్టడంలో తప్పులేదని సరిపెట్టుకుంటున్నాడన సమాచారం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ మొదటిసారి లవర్ బాయ్ గా కనిపించనున్నారు. హీరోయిన్ గా జెనిలియా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇక మ్యూజిక్ మాంత్రికుడు హారిస్ జైరాజ్ ఈచిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











