రామ్ చరణ్ తేజ కొత్త చిత్రం కోసం సింహం
రామ్ చరణ్ తేజ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందనున్న ఆరెంజ్ చిత్రం కోసం సింహం అవసరమైంది. స్క్రిప్టు డిమాండ్ మేరకు ఒక రోజు సింహంతో ఎపిసోడ్ చిత్రీకరించనున్నారు. అందుకోసం సౌత్ ఆఫ్రికాలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు. కానీ అక్కడ షూటింగ్ చాలా ఖరీదైన వ్యవహారం కావటంతో లొకేషన్ ని ఆస్ట్రేలియాకు మార్చారు. అందుకోసం లొకేషన్స్ వెతుకుతూ కెమెరామెన్, డైరక్టర్ భాస్కర్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. అలాగే వీటితో పాటు ట్రైనింగ్ ఇచ్చిన సింహాన్ని వెతుకున్నారు. సిడ్నీ, మెలబోర్న్ లో ఎనభై రోజులు ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. నాగబాబు తమ అంజనా ప్రొడక్షన్స్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మగధీర తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం ఇదే. ఇందులో చరణ్ సరసన జెనీలియా చేస్తోంది. అలాగే శృతి హాసన్ కూడా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రానుందని సమాచారం.
More from Filmibeat
రామ్ చరణ్ తేజ్ బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ సిడ్నీ ఫ్లాష్ బ్యాక్ జెనీలియా శృతి హాసన్ సౌత్ ఆఫ్రికా ram charan teja bommarillu bhaskar orange lion flash back sruthi hassan


Click it and Unblock the Notifications











