పులి, ఖలేజా దెబ్బకి ‘ఆరెంజ్’ వెన్యూ చేంజ్...!?
మహేష్ 'ఖలేజా" ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని రేడియో మిర్చి ఆఫీస్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే రామ్ చరణ్ 'ఆరంజ్" ఆడియో విడుదలనీ, అక్కడే జరపాలని అనుకున్నారు. అయితే 'ఖలేజా" ఆడియో ప్లాప్ అవ్వడం, సినిమా ఫలితమూ సోసోగానే వుండడం ఇప్పడు 'ఆరంజ్" టీమ్ ని ఆలోచనలోకి నెట్టిందట. ఎంతైనా సినిమా పరిశ్రమలో ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువ అంటుంటారు కాబట్టి 'ఆరంజ్ ఆడియో వేడుకకి వెన్యూ మారొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి.
అసలు ఏ ఫంక్షన్ లేకుండానే 'ఆరంజ్" పాటలు డైరెక్ట్ గా మార్కెట్ లోకి వచ్చేస్తాయనే మాటలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే హారిష్ జైరాజ్ ని ఉద్దేశిస్తూ 'అతను తెలుగులో నేరుగా సంగీతం అందించిన ఏ చిత్రమూ సక్సెస్ కాలేదంటూ" 'ఆరంజ్"నీ ఆ గాటన కట్టేసే పని మొదలెట్టారు యాంటీ ఫ్యాన్స్. మరీ దశలో 'ఆరంజ్" యూనిట్ ఆ మాత్రం ఆలోచించడం, అన్ని సెంటిమెంట్స్ నీ పరిగణనలోకి తీసుకోవడం చాలా మంచిదనే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











