Thalapathy Vijay: పాన్ ఇండియాలో విజయ్ నంబర్ వన్.. అదెలా సాధ్యం అబ్బా?

పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్. 1 హీరో ఎవరని అడిగితే.. ప్రతీ అభిమాని తమ ఫేవరెట్ హీరో పేరు చెప్పుకుంటారు. కానీ తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం టాప్ - 10 హీరోల లిస్ట్ బయటకు వచ్చింది. మరి ఈ జాబితాలో ఏ హీరో ఏ స్థానంలో ఉన్నారంటే..

ఒకప్పుడు దక్షిణాది సినిమాకి ఉత్తరాది సినిమాకి మధ్య విపరీతమైన పోటీ ఉండేది. దక్షిణాదిలో కూడా ఏ భాషకు ఆ భాషకు సపరేటుగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినీ పరిశ్రమలు ఉండడంతో ఆయా భాషల హీరోల మధ్య కూడా పోటాపోటీ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని దాదాపుగా అందరూ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారిపోతున్నారు.

 Ormax Media released the list of most popular Male pan india star heroes for the month of June

ఎలా అయ్యాడు: ఇక ప్రతి నెల ఆర్మాక్స్ మీడియా అనే ఒక సంస్థ ఎప్పటికప్పుడు పాన్ ఇండియాలో టాప్ టెన్ హీరోలు ఎవరు ఉన్నారనే విషయం మీద సర్వే చేసి ఒక లిస్టు విడుదల చేస్తూ ఉంటుంది. ప్రతి నెల లాగానే జూన్ నెలకు సంబంధించిన లిస్టును ఈరోజు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడుదల చేసింది.

ఇక ఎప్పటిలాగే ఈ నెలలో కూడా దళపతి విజయ్ ఈ పాన్ ఇండియా హీరో లిస్టులో మొదటి స్థానం సంపాదించాడు. దీంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే... ఇతర హీరోల అభిమానులు మాత్రం సరైన పాన్ ఇండియా సినిమా ఒకటి కూడా చేయకుండా ఆయన నెంబర్ వన్ పాన్ ఇండియా హీరో ఎలా అవుతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 Ormax Media released the list of most popular Male pan india star heroes for the month of June

షారుఖ్ రెండో స్థానం: ఇక ఈ మధ్యనే జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న షారుఖ్ ఖాన్ ఈ లిస్టులో రెండవ స్థానం సంపాదించుకోగా... తెలుగు స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్.. వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలు సంపాదించారు. ఒక తమిళ్ హీరో తర్వాత ఒక బాలీవుడ్ హీరో స్థానం సంపాదించుకోగా ఆ తర్వాత ముగ్గురు వరుసగా తెలుగు హీరోలు ఉండడం గమనార్హం. ఇక వీరి తర్వాత స్థానం అజిత్ కుమార్ దక్కించుకోగా ఆ తర్వాత స్థానాన్ని మాత్రం తమిళ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దక్కించుకున్నాడు.

 Ormax Media released the list of most popular Male pan india star heroes for the month of June

ప్రభాస్, అల్లు అర్జున్: ఇక ఎనిమిదో స్థానాన్ని రామ్ చరణ్ తేజ్ దక్కించుకోగా పదవ స్థానాన్ని మాత్రం అక్షయ్ కుమార్ సాధించాడు. ఇక పదవ స్థానాన్ని మహేష్ బాబు సంపాదించాడు. ఇక ఈ లిస్టు మొత్తం మీద పరిశీలిస్తే ఇద్దరు తమిళ స్టార్ హీరోలు ఉండగా... ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలు ఉన్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఏకంగా ఐదుగురు స్టార్ హీరోలు ఉండడం గమనార్హం. నిజానికి పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్, అల్లు అర్జున్ సహా బాలీవుడ్ హీరోలకు కూడా క్రేజ్ ఉంది.

విజయ్ కు ఎలా: కానీ నార్త్ లో ఎక్కువగా గుర్తింపు లేని విజయ్ ఏకంగా మొదటి స్థానం సంపాదించుకోవడం ప్రతినెలా అనేక చర్చలకు తావిస్తోంది. అయితే ఆర్మాక్స్ మీడియా సంస్థ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువగా మీడియాలో సోషల్ మీడియాలో ఎవరి గురించి చర్చ జరిగిందనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ లిస్టు ప్రకటిస్తున్నామని ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఇక ఈ లిస్టుకు సంబంధించిన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X