OTT కొత్త రూల్స్‌తో థియేటర్లు కుదేలు.. పాపం ఆ సినిమాల పరిస్థితేంటో మరి?

OTT New Rules: వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ "ఈగల్" సినిమాతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు "గుంటూరు కారం", రౌడీబాయ్ విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్", అలాగే నవమన్మథుడు నాగార్జున "నా సామి రంగా", తేజ సజ్జ "హనుమాన్", వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఏ ఒక్కరు కూడా పోటీ నుంచి వెనక్కి తగ్గేందుకు ఇష్ట పడడం లేదు. ఈక్రమంలోనే ఓటీటీ కొత్త నిబంధనలు తీసుకొచ్చి షాకిచ్చింది.

ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు హిట్టు అయితే ఒకలా, ఫ్లాప్ అయితే ఒకలా.. ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా హిట్టు అయితే నాలుగు వారాల తర్వాత ఫ్లాప్ అయితే మాత్రం 2 వారాలు కాగానే చిత్రాలు స్ట్రీమింగ్ చేసుకుంటామని.. సినిమా డిజిటల్ హక్కులు కొనుగోలు చేసినప్పుడే చిత్రబృందాలకు చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే వీటికి దర్శక, నిర్మాతలు కూడా ఒప్పకోక తప్పలేదని.. సినిమాలు హిట్టు అయితేనే అవి ఓటీటీలో కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతాయని సమాచారం.

OTT New Rules Effect on Flap Movies And Theatres

గతంలో ఏదైనా సినిమా థియేటర్ లో విడుదల అిన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు చెప్పారు. ఈ విషయం అప్పట్లో చాలా సంచలనమే అయింది. ముందే విడుదల చేస్తే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందని.. అందుకే కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాలని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మొత్తం మారిపోయింది. నేరుగా ఓటీటీ సంస్థలు రంగంలోకి దిగిన పెట్టి హిట్టు అయితే నాలుగు వారాలు, ఫ్లాప్ అయితే 2 వారాల కండీషన్లకు ఓకే చెప్పడం చిత్రంగా తోస్తోంది.

అయితే ఇందుకు కారణం కూడా ఉందని టాలీవుడ్ కోడై కూస్తోంది. ముందే డిడిటల్ ఒప్పందాలు చేసుకున్నప్పటికీ... సినిమా హిట్టు అయితే అదే ధరకు ఇచ్చినా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం 30 నుంచి 40 శాతం కట్ చేసి డబ్బులు ఇస్తున్నారట. ఈ కారణంగానే నిర్మాతలు కూడా సేఫ్ జోన్ లో ఉండి ఆలోచిస్తూ... సంక్రాంతి సినిమాల వరకు ఓటీటీ కంపెనీలు పెట్టిన నిబంధనలకు ఒప్పుకున్నారని అంతా అనుకుంటున్నారు. సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలకు మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తే ఓకే కానీ.. ఆ తర్వాత కూడా ఇలాగే చేస్తామంటే మాత్రం చాలా సమస్యలే వస్తాయి.

OTT New Rules Effect on Flap Movies And Theatres

ముఖ్యంగా థియేటర్లపై పెద్ద ప్రభావమే పడుతుంది. హిట్టు, ఫ్లాప్ ల మీద ఆధారపడి ఉంటే అంతా ఓటీటీల్లో చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ నిబంధనలు అంత మంచివి కావని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే ఓటీటీల కారణంగా థియేటర్ల ఆక్యుపెన్సీ బాగా తగ్గిపోయింది. హిట్ టాక్ వస్తే తప్ప ఎవరూ థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి నకబరచట్లేదు. ఇక యావరేజ్ టాక్ వస్తే.. ఓటీటీల్లో చూడొచ్చులే అని లైట్ తీసుకుంటున్నారు. దీంతో సినిమాలు బ్రేక్ ఈవెన్ అందుకోవడంలో ఫెయిల్ అవుతోంది. మరి కొత్తగా వస్తున్న ఈ రూల్స్ వల్ల ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X