పవన్ కళ్యాణ్‌కు ‘పద్మ భూషణ్’?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ భూషణ్' అవార్డు ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అది ఈ ఏడాది కాక పోయినా వచ్చే ఏడాది అయినా రావచ్చని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ ఈ అవార్డుకు వస్తుందా? రాదా? అర్హుడా? అనర్హుడా? అనే సంగతి పక్కన పెడితే......పవన్ కళ్యాణ్ కంటే సీనియర్లు పరిశ్రమలో చాలా మంది ఉంది ఉన్నారు. ఏళ్లుగా పరిశ్రమకు సేవ చేస్తున్నా అవార్డు రాలేదనే కొందరు బహిరంగానే అసంతృప్తి వెల్లగక్కారు.

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా ఓ వెలుగు వెలిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. తనకు ఇప్పటికీ పద్మశ్రీ అవార్డు దక్కక పోవడంపై కైకాల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసారు. మరి వీరందరినీ వదిలి పవన్ కళ్యాణ్ లాంటి వారికి ఇస్తే విమర్శలు మాత్రం తప్పవు.
ఆ అవార్డుల గోల పక్కన పడితే...ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దొంగ బాబాలు, మూఢ నమ్మకాలపై విమర్శనాస్త్రంగా వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.
రేశ్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సురేశ్, శరత్‌మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్‌కుమార్ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది. తొలి రోజు ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో కలిపి రూ. 10 కోట్లపైనే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











