SSMB28: మహేశ్ మూవీకి కృష్ణ స్టైల్ టైటిల్.. పోటుగాడు అని వచ్చేలా!
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ దూసుకుపోతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌లోనే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. ఇలా ఇప్పుడు చాలా కాలం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మూడో చిత్రాన్ని చేస్తోన్నాడు. 'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ మూవీల తర్వాత వస్తోన్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు.
క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీనికి అనుకోని అవాంతరాలు ఎన్నో ఎదురు అవుతోన్నాయి. ఫలితంగా ప్రస్తుతానికి చిత్రీకరణ నిలిచిపోయింది. కానీ, జూన్ మొదటి వారంలో ఇది పున: ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇక, మే 31వ తేదీన ఈ సినిమా నుంచి టైటిల్‌తో కూడిన గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తారని ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా టైటిల్ గురించి కూడా ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మహేశ్ సినిమాకు కొత్త టైటిల్ వెలుగులోకి వచ్చింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కలయికలో రాబోతున్న చిత్రానికి ఎన్నో రకాల టైటిళ్లను పరిశీలించారు. ఇందులో భాగంగానే దీనికి 'అయోధ్యలో అర్జునుడు', 'అమ్మ కథ', 'అమరావతికి అటు ఇటు', 'గుంటూరు కారం', 'ఊరికి మొనగాడు' అనే పేర్లు పెట్టాలని అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. దీనికి 'పల్నాడు పోటుగాడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారని తెలిసింది. ఈ సినిమా కథ మొత్తం పల్నాడు ప్రాంతం బ్యాగ్‌డ్రాప్‌తో సాగుతుందట. అందుకే ఈ టైటిల్ అయితేనే దీనికి కరెక్టుగా సరిపోతుందని గురూజీ భావించినట్లు టాక్.

ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











