twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ దేశంలో ప్రభాస్ ఖరీదైన విల్లా.. సినిమాల తరువాత డార్లింగ్ అదే దేశంలో ఉంటాడా?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ గత కొంతకాలంగా వరుసగా బిగ్ పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి అనంతరం రెబల్ స్టార్ జాతకం ఒక్కసారిగా మారిపోయింది. అతను ఇప్పుడు ఒక్కో సినిమాకి 150కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా ఒక టాక్ అయితే వస్తోంది. ఇక చేతిలో 5 సినిమాలు ఉండగా డార్లింగ్ వచ్చిన ఆదాయాన్ని విదేశాల్లో కూడా పెట్టుబడులుగా పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల డార్లింగ్ ఒక దేశంలో అత్యంత ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు టాక్ వస్తోంది.

     చాలా వరకు విదేశాల్లోనే..

    చాలా వరకు విదేశాల్లోనే..

    ఫారిన్ టూర్స్, ఓవర్సీస్ షూటింగ్ షెడ్యూల్స్ కి ప్రభాస్ నో చెప్పే రోజులు పోయాయని తెలుస్తోంది. ఎందుకంటే అప్పట్లో ప్రభాస్ హైదరాబాద్‌తో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చేవాడని, విదేశాలకు వెళ్లేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదని టాక్‌ వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన సినిమాల్లో చాలా వరకు విదేశాల్లో కనీసం రెండు పాటల షూటింగ్ అయినా జరుగుతోంది.

    విహారయాత్రకు..

    విహారయాత్రకు..

    కేవలం షూటింగ్స్ పరంగానే కాకుండా ప్రభాస్ ఇటీవల కాలంలో విదేశాల్లోనే ఎక్కువగా రెస్ట్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇక అందులో భాగంగా రెబల్ స్టార్ యూరప్ ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నాడట.

    అక్కడ అతను కొన్నిసార్లు తన బంధువులు, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళుతున్నాడట.

     ఖరీదైన విల్లా..

    ఖరీదైన విల్లా..

    ఇక ఈ నటుడు యూరప్ కంట్రీస్ లోని ఒక ప్రశాంతమైన బీచ్‌కు సమీపంలో ఉన్న పాతకాలపు విల్లాను కొనుగోలు చేయాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇంతవరకు భారతదేశంలో ఏ నటుడు కూడా అలాంటి ఖరీదైన విల్లాను కొనుగోలు చేయలేదట. దాని విలువ దాదాపు 300కోట్లకు పైగానే ఉంటుందట. అంతే కాకుండా ప్రభాస్ దాని కోసం మరింత ఖర్చు చేసి మరికొన్ని చెంజెస్ చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

    భారీగా పెట్టుబడులు

    భారీగా పెట్టుబడులు

    అంతే కాకుండా యూరప్ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో కూడా ప్రభాస్ భారీగా పెట్టుబడులు పెట్టాలని, కొన్ని ఖరీదైన ఆస్తులను సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఇండియాలో వేల కోట్ల ఆస్తులను సంపాదించుకున్న ప్రభాస్ విదేశాల్లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచనలో ఉన్నారట. సాధారణంగా అందరూ బిజినెస్ లలో ఇన్వెస్ట్ మెంట్ చేయాలని చూస్తుంటే ప్రభాస్ మాత్రం పాత పద్దతిలోనే ఆస్తులను కొనుగోలు చేసి వాటి వాల్యుని పెంచుకునేలా చేస్తున్నాడట

     అక్కడే ఉంటాడా?

    అక్కడే ఉంటాడా?

    ఇక ప్రభాస్ యూరప్ లోని తన విల్లాలోనే నివసిస్తాడా లేదా తరువాత వాటిని అమ్ముతాడా అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఎక్కువ కాలం గడపాల్సి వస్తే మాత్రం ఈ స్టార్ హీరో యూరప్ లో కొన్న విల్లాలోనే జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వేకువడుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ముంబైలో ఒక ఖరీదైన బిల్డింగ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

    రానున్న సినిమాలు..

    రానున్న సినిమాలు..

    ఇక సినిమాల విషయానికి వస్తే రాధే శ్యామ్ విడుదల కోసం ప్రభాస్ ఎదురుచూస్తున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మర్చిలోనే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ వంటి సినిమాలు రానున్నాయి. అనంతరం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K, సందీప్ రెడ్డి స్పిరిట్ వంటి సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

    English summary
    Pan india Hero prabhas new costly house in Europe country,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X