మహేష్ సినిమా కోసం పాన్ ఇండియా ప్లాన్.. అందుకే ఆ స్టార్స్ నెగిటివ్ రోల్స్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో మహేష్ కూడా త్వరలోనే పాన్ ఇండియా సినిమాతో రావాలనే ఆలోచనలో ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
అయితే అంతకుముందే మహేష్ బాలీవుడ్ అలాగే ఇతర ఇండస్ట్రీలో తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ ఈ సూపర్ స్టార్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. నవంబర్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే సినిమా కథ పాన్ ఇండియాకి సెట్టయ్యే విధంగా ఉందని ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ మోసాలను అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి నిజ జీవితం ఆధారంగా కొన్ని నెగిటివ్ రోల్స్ కూడా క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

అందుకే దర్శకుడు పరశురామ్ కూడా సినిమా కథను మార్చనున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ కన్నడ నుంచి సుదీప్ వంటి వారిని కూడా మార్కెట్ కోసం ఆలోచించే విలన్ రోల్స్ కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని మహేష్ మాత్రం పాన్ ఇండియా కాన్సెప్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సర్కారు వారి పాట అనంతరం మహేష్, అనిల్ రావిపూడితో కూడా మరో చిన్న సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











