Sreeleela: శ్రీలీలను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో... ఆ ఒక్క కారణం వల్లే!
టాలీవుడ్ సెన్సెషన్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చేసింది రెండు సినిమాలు... చేతిలో 12 సినిమాలు ఉన్నాయి. ఒప్పుకోని సినిమాలు మరెన్నో. వరుస సినిమాలతో పుల్ బిజిగా ఉన్న హీరోయిన్ అంటే శ్రీలీల. ఆమె మా సినిమాలో చేయాలంటే.. మా సినిమాలో చేయాలంటూ.. దర్శక నిర్మాతలు క్యూలో ఉంటున్నారు. అలాంటి హీరోయిన్ ను ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశారు. ఒకే ఒక్క రీజన్ వల్ల రిజెక్టే చేశారంట. ఆ వివరల్లోకి వెళితే...
సూపర్ క్రేజ్: శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆమె చేతిలో దాదాపు 12 సినిమాలు ఉన్నాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈ కన్నడ భామ పరిచయం అయింది. ఇక ఆ సినిమా తర్వాత రవితేజ ధమాకాలో నటించి.. తన టాలెంట్ ఏంటో ప్రేక్షకులకు చూపించింది. డ్యాన్స్, నటనతో శ్రీలీల ఆ సినిమాలో ఆకట్టుకుంది.

ఆఫర్స్ క్యూ: ఇక రవితేజ ధమాక సినిమా తర్వాత శ్రీలీలకు మంచి ఆఫర్స్ వచ్చాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, బాలయ్య భగవంత్ కేసరి, పవన్ కల్యాణ్, రామ్ స్కంధ, నితిన్ ఎక్ట్స్రా ఆర్టినరి మ్యాన్, విజయ్ దేవరకొండ మూవీ, వైష్ణవ్ తేజ్ ఆది కేశవ, నితిన్ నార్నే, మోక్షజ్ఞ వంటి హీరోల పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక భామకు తిరుగులేదని తెలుస్తోంది. అంతే కాదు.. ఆమె మా సినిమాలో చేయాలంటూ లేదు మా సినిమాలో చేయాలని దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు.

రిజెక్ట్ చేసిన ప్రభాస్: అయితే శ్రీలీల ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్స్ తో బిజి బిజిగా గడుపుతోంది. అంతే కాదు.. ఈ హీరోయిన్ కోసం.. దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో శ్రీలీలను రిజెక్ట్ చేశారట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. శ్రీలీల హైట్ తక్కువ కాబట్టి... ఆమె తన సినిమాలో వద్దని చెప్పారట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రీజన్ వల్లే: ప్రభాస్ చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి స్టార్ దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తున్నారు. ఇక ఆ సినిమాలో మొదట శ్రీలీలను అనుకున్నారట. అయితే శ్రీలీల హైట్ తక్కువ కాబట్టి.. ప్రభాస్ ఆమెను రిజెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

హాట్ టాపిక్ గా: ప్రభాస్ మారుతి సినిమాలో అలా శ్రీలీల గొల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ సినిమాకు రాజా డిలాక్స్ అనే పేరు వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏదేమైనా టాలీవుడ్ మొత్తం శ్రీలీల వెనక పరుగులు పెడుతుంటే.. ప్రభాస్ మాత్రం శ్రీలీలను వద్దు అనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











