ఆదిపురుష్ దెబ్బకి Prabhas సంచలన నిర్ణయం... వాళ్లకి ఇక నో ఎంట్రీ.. ఆ సినిమా రద్దు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన నేపథ్యంలో ఆయనకు ఎక్కువగా పాన్ ఇండియా సబ్జెక్టులే తలుపు తడుతున్నాయి. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆయన అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ బాహుబలి తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ హిట్టు ఒక్కటి కూడా లేదు. అయినా సరే ఆయన వెనుక దర్శక నిర్మాతలు పడుతూనే ఉన్నారు.
షాకింగ్ నిర్ణయం: రామాయణం నుంచి ప్రేరణ పొంది ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ అభిమానులను నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ప్రభాస్ ప్రస్తుతానికి బాలీవుడ్ దర్శకులతో పనిచేయడం మానుకోవాలని నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్‌తో కమిట్ అయిన ప్రాజెక్ట్‌ను కూడా రద్దు చేసుకున్నాడని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆసక్తి నెలకొన్నా: రద్దు చేసిన ప్రాజెక్ట్‌లో ప్రభాస్ - హృతిక్ రోషన్‌లు ఒక పెద్ద యాక్షన్ మూవీ చేయాల్సి ఉంది. ఈ కాంబినేషన్ కాస్త కొత్తగా ఉండడంతో అభిమానులలో మాత్రమే కాదు సినీ ప్రేమికులందరిలో నూతన ఆసక్తి ఏర్పడింది. అయితే, ఆదిపురుష్ ఫెయిల్యూర్ కారణంగా, ప్రభాస్ బాలీవుడ్ దర్శకులతో కలిసి పనిచేయడానికి వెనుకాడాడు. నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

సిద్ధార్థ్ ప్రాజెక్ట్ క్యాన్సల్: ఫైటర్(హృతిక్ రోషన్ తో సిద్ధార్థ ఆనంద్ చేస్తున్న చిత్రం) షూటింగ్ పూర్తి చేసిన తర్వాత నవీన్ యెర్నేని సిద్ధార్థ్ ఆనంద్‌ను కలిశారు. దురదృష్టవశాత్తు ప్రభాస్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా వచ్చే ఏడాది కూడా సెట్స్ మీదకు వెళ్లడం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ గతంలో బ్యాంగ్ బ్యాంగ్ , వార్ వంటి విజయవంతమైన హృతిక్ రోషన్ సినిమాలకి దర్శకత్వం వహించాడు.

దిగజార్చే ప్రయత్నం: ఇక సిద్ధార్థ్ ఆనంతో సినిమా మాత్రమే కాదు... బాలీవుడ్ దర్శకులు ఎవరైనా ప్రభాస్ కు కథ చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నా సరే ఆయన కథ వినడంపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని... ప్రస్తుతానికి తన డేట్స్ ఖాళీ లేవు కాబట్టి తాను ఫ్రీ అయ్యాయనని భావించినప్పుడు ముందుగా మీకే కబురు పెడతానని చెప్పి వెనక్కి పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిజానికి ప్రభాస్ ను బాలీవుడ్ దర్శకులు కావాలని ఆయన మార్కెట్ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని గతంలో కొందరు విశ్లేషణలు కూడా చేశారు.
అది నిజమేనా: అయితే అలా జరగడానికి ఆస్కారం లేకపోయినా ప్రభాస్ వరుస సినిమాలు డిజాస్టర్ గా నిలుస్తున్న నేపథ్యంలో అది నిజమేనేమో అని కొందరు నమ్మాల్సిన అవసరం ఏర్పడుతుందని ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ప్రభాస్ బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఆయన కెరీర్ మీద పడుతుందని కొన్నాళ్లపాటు మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంటుందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి మరి.


Click it and Unblock the Notifications











