చరణ్‌తో ప్రభాస్ సినిమా.. అప్పుడే కాన్సెప్ట్ లీక్.. వామ్మో ప్లానింగ్ మాములుగా లేదుగా!
ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్ లో 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ప్రభాస్ అక్కడి మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 'ఆర్ఆర్ఆర్' స్టార్స్ దర్శకుడు రాజమౌళి గురించి పొగుడుతూ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తాను ఓ సినిమా చేస్తానని చెప్పారు. దీంతో ఆ సినిమా ఏంటనేది ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అయితే దానిపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. వివరాళ్లోకి వెళితే..
'ప్రభాస్ కల్కి 2898 AD'సినిమా గ్లింప్స్ విడుదలై సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రఖ్యాత శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో మూవీటీమ్ పార్టిసిపేట్ చేసి మూవీ టైటిల్, గ్లింప్స్‌ను గ్రాండ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్రబృందం అక్కడి మీడియాతో కాసేపు మాట్లాడింది. అయితే అందులో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి గురించి మాట్లాడారు.

గొప్ప దర్శకుడు: చరణ్ తో సినిమా.. ఇండియాలో ఉన్న అద్భుతమైన డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు. 'ఆర్‌ఆర్‌ఆర్' ఓ గొప్ప చిత్రం. ఆ చిత్రంలోని సాంగ్ కు ఆస్కార్ రావడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఇది భారతదేశ ప్రజలందరికీ దక్కిన గౌరవం. జక్కన్న ఇలాంటి వాటికి అర్హుడని నా అభిప్రాయం. ఇక చరణ్ నాకు ఓ మంచి ఫ్రెండ్. తప్పకుండా ఏదో ఒక రోజు కలిసి మేమిద్దరం ఓ చిత్రం చేస్తాము అని ప్రభాస్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

మహాభారతమేనా: అయితే ఈ కామెంట్స్ వైరల్ అవ్వడం వల్ల.. ప్రభాస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే అది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంతకీ ఎలాంటి సినిమా వస్తుందా అని ఇప్పటికే చర్చలు మొదలు పెట్టేశారు. ప్రభాస్ మాట్లాడింది.. మహాభారతం ప్రాజెక్ట్ గురించే అని అంటున్నారు. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని కూడా చెప్పారు.
ఏ పాత్రల్లో నటిస్తారో: ఇకపోతే ప్రస్తుతం జక్కన్న.. మహేశ్ బాబుతో కలిసి SSMB29 చిత్రాన్ని భారీ స్థాయిలో చేస్తున్నారు. దీని తర్వాతే మహాభారతం ప్రాజెక్ట్ ను మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఇప్పుడు ప్రభాస్.. రాజమౌళిపై ప్రశంసలు కురిపించడం, చరణ్ తో సినిమా చేస్తాననడం వంటి కామెంట్స్ తో.. అది మహాభారతం సినిమానేమోనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

వీడియోస్ వైరల్: ఒకవేళ ఇది నిజమైతే మహాభారతంలో ప్రభాస్, చరణ్.. ఎలాంటి పాత్రల్లో నటిస్తారోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మహాభారతం సినిమా గురించి అభిమానులు తమ తమ అభిమాన హీరోలు ఈ పాత్ర చేస్తే బాగుంటుందని వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











